అంచనాలను పెంచేస్తున్న ‘అరవింద సమేత’

Aravinda Sametha-posterఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌, టీజర్‌తో అంచనాలను పెంచేసింది ‘అరవింద సమేత’ చిత్రయూనిట్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘అరవింద సమేత’ తాజాగా సినిమాకు సంబందించి ఓ సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేశారు మేకర్స్‌.

ఇటీవలే విడుదల చేసిన ‘అనగనగనగా’ లిరికల్‌ సాంగ్‌ వైరల్‌గా మారింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి సెప్టెంబర్‌ 20న విడుదల చేయనున్నట్లు, ఆ తరువాత సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఈరోజు ( సెప్టెంబర్‌ 18) మరో సర్‌ప్రైజ్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతమందిస్తున్నారు. దసరా కానుకగా ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు

Send a Comment

Your email address will not be published.