అక్షర ఉచ్చారణ ఆవశ్యకము

కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా
నస్నానం నవిలేపనం న కుసుమం నలాంకృతామూర్ధజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యాసంస్కృతా ధార్యతే
క్షీయంతేఖిలభూషణాని సతతం వాక్భూషణం భూషణం

మానవులకు చంద్రకాంతితో సమానంగా ప్రకాశించే దండలు కాని, భుజకీర్తులు కానీ, స్నానాలు, పైపూతలు పూలు వారి భుజాలను అలంకరించలేవు. ఎటువంటి వాక్కు అయితే సంస్కృతాన్ని ధరించి వుంటుందో అటువంటి ఒక్క వాక్కు మాత్రమే సరిగ్గా అలంకరిస్తుంది. అన్నీ ఆభరణాలు నశించి పోతాయి కానీ ఒక్క మాట మాత్రమే శాశ్వత ఆభరణంగా వుంటుంది మానవులకు.

20190527_201102

20190527_2213101

వాక్కు ప్రాముఖ్యత గురించి తెలిపిన భర్తృహరి సుభాషితం అందరికీ ఆదరణీయం, ఆచరణ యోగ్యం. అయితే మాట పలికే విధానం పెడర్ధాలకు దారితీస్తుందన్నది కూడా అక్షర సత్యం. తెలుగు భాషలో వ్యాకరణం నిశితంగా పరిశీలిస్తే ముఖ్యంగా పద్యాల లోని సంధులు, సమాసాలు, ఛందస్సు విశ్లేషిస్తే ‘మన’ భాష ఎంత సుసంపన్నమైన భాషో అర్ధమౌతుంది. సంస్కృతంలో కూడా లేని కొన్ని అక్షరాలు, వ్యాకరణ విశేషాలు ‘మన’ భాషలో అన్వయించి తెలుగు భాష ఒక సర్వోత్క్రుష్టమైన భాషగా తీర్చిదిద్దారు మన పూర్వీకులు. ఎంతోమంది ఋషులు, పండితులు తమ సారస్వత విజ్ఞానంతో తెలుగు అక్షర పొదివిపట్టి లాలించి, బుజ్జగించి సంస్కృత భాషకు సరిసమానమైన భాషగా పదాలు, పాదాలు, పల్లవులు, చరణాలు, పద్యాలు మనకు అందించారు.

నన్నయ మహాభారతాన్ని అనువదించినపుడు కవీంద్రులు కథా గమనం, కథా గమనంలోని అర్థ యుక్తిని పరిశీలిస్తారు కాబట్టి వారి కోసం ప్రసన్న కథా కలితార్థ యుక్తితో రచించాడు. సంస్కృత కవేతరులు, అంటే తెలుగు వారు అక్షర రమ్యతను ఆదరిస్తారని తత్సమాలు జోడించి సంస్కృతానికి దగ్గర పదాలను ఉపయోగించి భారతాన్ని తెనిగించాడు.

20190527_221738

ప్రముఖ వేద పండితులు, వేదాలే కాకుండా శాస్త్రాలు, వేదాంగాలు, సంస్కృతాంధ్రములలో నిష్ణాతులైన శ్రీ రేమేళ్ల అవధానులు గారు మెల్బోర్న్ నగరం విచ్చేసి భువన విజయం సాహితీ సంవేదిక నిర్వహించిన కార్యక్రమంలో రెండు ప్రధానాంశాలపై తెలుగులో ప్రసంగించారు.
1. భారతీయ శాస్త్ర, కావ్యవిజ్ఞానంలో – సంస్కృత భాషా వైశిష్ట్యం
2. తెలుగు – సంస్కృతముల మధ్య ప్రత్యేక ఆత్మీయతానుబంధం

భాషలో ఉన్న సౌందర్యంతో పాటు ఉచ్చారణ దోషాలను విశదీకరించారు. ఒకే పదం ఉచ్చారణలో తేడా ఉంటే అర్ధం ఎలా మారిపోతుందో ఉదాహరణలతో చెప్పారు. మహాభారతం మరియు రామాయణ గాధల్లోని ఒళ్ళు గగుర్పొడిచే కొన్ని సన్నివేశాల్లోని సంభాషణలు అత్యంత రమ్యంగా పామరులకు కూడా అర్ధం ఆయ్యే విధంగా వివరించడం ముదావహం.

ఈ కార్యక్రమం భువన విజయ తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించబడింది. భారతీయ పురాణ ఇతిహాసాల్లో 9 అంకెకున్న ప్రాధాన్యతను సంతరించుకొని భాషాపరమైన ఈ కార్యక్రమం నిర్వహించడం మంచి శుభసూచకం.

Anniv

ఈ కార్యక్రమానికి మెల్బోర్న్ లోని భాషాభిమానులు, పురప్రముఖులు విచ్చేసి శ్రద్ధాసక్తులతో అవధానులు గారి ప్రసంగం వినడం జరిగింది. శ్రీ బొమ్మకంటి కుమార్ దంపతులు శ్రీ అవధానులు దంపతులను సత్కరించడం జరిగింది. భువన విజయ సభ్యులు, సంస్కృతాంధ్రములలో పండితులైన శ్రీ సరిపల్లి సూర్యనారాయణ గారు వ్రాసిన ప్రశంసా పత్రం, అవధానులు గారిని మరియు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.

Send a Comment

Your email address will not be published.