అలా అలా....

అలా  అలా....

కుట్ర పన్నుతున్నారు కదూ
పన్నండి
అల్లండి వల
చివరికి అందులో చిక్కుకునేది మీరే
—————————–
మనిషి పడే అన్ని బాధలు చెప్పమంటే
చెప్తాను
ఒక్క మాటలో…
అది
ప్రేమ అని.
——————————-
ఇష్టమున్న వారితో
గొడవ పడిన తర్వాత
వాళ్ళు చెప్పే కారణాలను
ఆస్వాదించడానికే
మళ్ళీ గొడవపడటానికి
కారణాలు వెతుకుతుంటారు
కొందరు
———————————
ప్రేమా
సిగరెట్టూ ఒక్కటే
రెండూ పెదవులతో మాట్లాడి
హృదయాన్ని పుండుగా చేసి పోతాయి
————————————-
వీలున్నంత వరకు
ఆనందంగా ఉండాలనే అనుకుంటాం
కానీ
కొన్ని “జ్ఞాపకాలు”
జ్ఞాపకానికి వచ్చి
నలిపేస్తాయి

జగదీష్ యామిజాల

Send a Comment

Your email address will not be published.