ఆంధ్ర ప్రదేశ్ లో టొయోటా

toyotaఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతోంది. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ ఫలించింది.

జపాన్ దేశానికి చెందిన టొయోటా కంపెనీ తాను తయారు చేస్తున్న రెండు హైబ్రిడ్ మోడల్స్ కార్లను తొలిసారిగా అమరావతిలో ప్రారంభించనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా 10 ఎలక్ట్రిక్ వాహనాలను అందించనుంది. ఈ మేరకు ఈ నెల 16న ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. నిజానికి ఈ సంస్థ ఈ యూనిట్ ను గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించాలనుకుంది. అయితే చంద్రబాబు చొరవతో అది ఆంధ్ర ప్రదేశ్ వైపు మొగ్గు చూపింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి లోకేష్ బెంగళూరు వెళ్లి టొయోటా ప్రతినిధులతో చర్చలు జరపడం జరిగింది. అమరావతిని తమ ప్రయోగ, ప్రచార కేంద్రంగా ఉపయోగించుకోవాలని ఆయన కోరడం జరిగింది.

అందుకు టొయోటా ప్రతినిధి వర్గం అంగీకరించి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఈ సంస్థ వల్ల రాష్ట్రంలో వందలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

Send a Comment

Your email address will not be published.