ఆస్ట్రేలియాలో తెలుగు బడులు

తెలుగు బడులు – తెలుగు సంఘాలు

Telugubadi-Australiaఆస్ట్రేలియాలో తెలుగు వారందరికి తెలుగు భాష, సంప్రదాయాలపై మక్కువ ఎక్కువ.

సిడ్నీ, మెల్బర్న్, అడెలైడ్, పర్త్, కేన్బెర, బ్రిస్బేన్ లలోని స్థానిక పెద్దలు వాటి విశిష్టతను గుర్తించి, వాటిని భావి తరాలకు అందించాలనే సదుద్దేశ్యంతో తెలుగు బడులను ప్రారంభించారు. తెలుగు బడి సిడ్నీలో తెలుగు అసోసియేషన్ తోపాటే 1993 లో పుట్టింది. అలాగే మెల్బర్న్, అడెలైడ్, పర్త్, కేన్బెర, బ్రిస్బేన్ నగరాల్లో అక్కడి తెలుగు సంఘాలు గత అనేక సంవత్సరాలుగా తెలుగు బడులు నిర్వహిస్తున్నాయి.

ఆయా తెలుగు సంఘాల యాజమాన్యాలు నిరంతరం బడులకు ఆర్థిక సహాయాన్ని, administrative support ని అందించి ప్రోత్సహిస్తున్నాయి.

తెలుగు సంఘాలు తెలుగు బడులను ఉచితంగా నిర్వహిస్తున్నాయి (no tuition fees). కావలసిన వనరులను అందిస్తున్నాయి. తెలుగు బడి పిల్లలకు stage performances ఇవ్వడంలోను, radio ప్రోగ్రాంలలో పాల్గొనడంలోను ప్రోత్సహిస్తున్నాయి. ఇటువంటి అవకాశాలు పిల్లలు తెలుగు నేర్చుకోడమే కాకుండా రాను రాను వారి జీవితాల్లో పురోభివృద్ధికి ఎంతో దోహదం చేయగలవు.

తెలుగు బడులు – FTAA పాత్ర

FTAA మొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి “To continue the working on recognition of Telugu as a community language in all levels of governments and introducing in the schools in Australia”.

ఈ లక్ష్యం సాధించాలంటే ఆస్ట్రేలియాలో నలుమూలలా నడుస్తున్న తెలుగు బడుల భూమిక ఎంతైనా ఉన్నదనడంలో అతిశయోక్తి లేదు.

అన్ని బడులలో ఒకే విధమైన పాఠ్యాంశాలు, ఒకే విధమైన బోధనా పద్ధతులు ఉన్నట్టయితే మన లక్ష్య సాధన సులభతరమౌతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బడులు అన్నిటిని ఒకే తాటిపైకి తేవాలనేదే ఈ యోచన.

తెలుగు బడులు – ఆవశ్యకత

తెలుగు రాష్ట్రాలలో ప్రాధమిక స్థాయిలో పిల్లలు పాఠశాలలలో ప్రవేశించేసరికి తెలుగు భాషా సామర్థ్యం సహజంగా కలిగి ఉంటారు. పిల్లలు తెలుగులో అలవోకగా మాట్లాడడం, ప్రశ్నించడం, అర్థం చేసుకోవడం, సంకేతాలు/చిత్రాలద్వారా భావాన్ని గ్రహించడం వంటి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈ సావకాశం ఇతర దేశాలలోను, ఇతర రాష్ట్రాలలోను పుట్టి పెరిగే తెలుగు పిల్లలకు చాలా తక్కువ. అక్కడి సామాజిక భాషా (English/Hindi) సంపర్కం వల్ల వారు ఆ భాషలనే అలవరచుకుంటారు.

దీనివల్ల తెలుగేతర ప్రాంతాల్లో పెరిగే మన పిల్లలకు తెలుగు నేర్పితే కాని అలవడదు. అలా నేర్పడం ప్రతి కుటుంబానికి సావకాశపడదు. అక్కడి తెలుగు సమాజాలు పిల్లలకి తెలుగు నేర్పడం జటిలమైన సవాలు అని తెలిసినా, దాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని, తెలుగు బడుల ద్వారా భాష నేర్పే ప్రయత్నం చేస్తుండటం మనకి తెలుసు.

భాషని పదం తర్వాత పదం, వాక్యం తర్వాత వాక్యం చెప్పి బోధించలేము. భాష నేర్చుకోడంలో ఫలితాలు వెంటనే రావు. భాష నేర్చుకునే ప్రయత్నంలో తెలియకుండానే భాషాజ్ఞానం పిల్లలకి అలవడుతుంది. పిల్లలు జ్ఞానాత్మకంగా సమర్థులైనపుడు మాట్లాడుతారు. మాట్లాడనంత మాత్రాన వారికి భాష రాదని చెప్పరాదు. ఇంట్లో తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకుని తగిన సమాధానం ఏ English లోనో ఇవ్వడం మనం చూస్తాము. ఇదే వారికి తెలుగు అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నదనడానికి నిదర్శనం.

భాషను నేర్చుకోవడంలో అనుకరణకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో తెలుగులో మాట్లాడడం ద్వారా పిల్లలు తలిదండ్రులను అనుకరిస్తూ భాషని సహజంగా, అవలీలగా గ్రహిస్తారు, మాట్లాడతారు.

భాషాభ్యాసంలో ఒక క్రమమంటూ ఉండదు. అక్షరాలు, గుణింతాలు, పదాలు, వాక్యాలు మొ. క్రమంలో నేర్పితే భాష రాదు. అన్నీ సమపాళ్ళలో సందర్భోచితంగా బోధించడమే ప్రాథమిక తరగతుల్లో ముఖ్యం. అందుకే అ-ఆ లు దిద్దిస్తూ ఒక గేయం పాడించడం, గుణింతాలు నేర్పుతూ ఒక కథలు వినిపించడం, పిల్లలచేత ప్రతి రోజూ మాట్లాడించడం వంటివి బడిలో జరుగుతుంటాయి.

భాషా జ్ఞానం పెంపొందడానికి పదజాలం చాలా అవసరం. వాటిని పిల్లలు బొమ్మల ఆధారంగా తొందరగా నేర్చుకోగలుగుతారు. అవి వారికి పరిచయమున్న సాంఘిక పరిసరాలకి సంబంధించినవై ఉండాలి (sensitive to their familiar environment). అప్పుడే పిల్లలు సామాజిక విషయాలను తెలుగులో వ్యక్తీకరించగలరు. లేకపోతే భాషకి, వారి జీవితానికి సంబంధం లేకుండా పోతుంది. ఇది Mandarin, Japanese వంటి భాషలను నేర్చుకునే తెలుగు పిల్లలు ఇంటికి వచ్చాక వాటిని వాడే అవసరం ఇంటి దగ్గర లేక నేర్చుకున్నది త్వరగా మరిచిపోయే పరిస్థితి మనం చూస్తూంటాం. అదే తెలుగైతే ఇంట్లో, బాధువులతో, మిత్రులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. తద్వారా భాషాజ్ఞానం పెంపొందుతుంది.

తెలుగు బడులు – సమస్య మనకేనా?

మాతృ భాష నేర్పడం అనే సమస్య “తెలుగుకేనా లేక మిగిలిన భాషలకి కూడా ఉందా?” అనే ప్రశ్న వచ్చింది.  అనేక community language schools (including, Indian, European, Asian & Arabic) ని పరిశోధించగా, ఈ సమస్య Australia లో అన్ని భాషల వారికి ఏదో పాళ్ళులో ఉన్నదని తెలిసింది. ఈ అన్వేషణలో విద్యార్థులు ఏ కొత్త భాష నేర్చుకోడంలోనైనా ప్రతి stage కి కొన్ని నిర్ధిష్టమైన భాషా ప్రయోగాలు నేర్చుకోవాలని తేలింది. దీని వల్ల “ఏదో తెలుగు భాష చెప్పుకు పోడం కాకుండా, రాను రాను పిల్లలు తెలుగులో సంభాషణాసామర్థ్యం (competence to speak) పెంచుకోగలగాలి” అన్న focus మాకు ఏర్పడింది.

ఐతే దీనికి తగ్గ పాఠ్యపుస్తకాలు లేవు, Italian, French, Spanish వంటి భాషలకు ఆయా దేశాల్లో అవి ఒకే భాషలు కాడంవల్ల, ఆయా cultures ఇక్కడి (Australia) culture ని పోలి ఉండడంవల్ల, అక్కడి పాఠ్యపుస్తకాలు  Australia లో వాడుకుందుకు వీలుంది. అదే ఇండియా లో – పలు భాషలు, పలు లిపులు, పలు సంప్రదాయాలు. దేనికదే సాటి.  అక్కడి తెలుగు పాఠ్యపుస్తకాలు ఇక్కడ వాడుకుందుకు వీలు పడదు. మనకు కావలసిన విధంగా తయారు చేసుకోవలసిన అవసరం ఉంది.

తెలుగు బడులు – తలిదండ్రుల పాత్ర

తెలుగు భాష ప్రతి తెలుగు బిడ్డ జన్మసిద్ధ హక్కు. వారు తెలుగేతర ప్రాంతాల్లో పెరుగుతున్నందున భాష వారికి సహజంగా రాకపోవచ్చు. అంతమాత్రాన వారికి భాషా వంచన జరగరాదు.

పిల్లలతో ఇంట్లో తెలుగులో మాట్లాడవచ్చేమో కాని, తెలుగు నేర్పే అవకాశాలు తలిదండ్రులకు తక్కువ. సమష్టి వాతావరణంలో పిల్లలు భాష మాట్లాడడం, చదవడం,  రాయడం వంటివి చెయ్యడం సులభమౌతుంది.  అది తెలుగు బడులు అందిస్తున్నాయి.

తలిదండ్రులు తమ పిల్లలకు తెలుగు నేర్పడం ఒక ప్రాథమిక బాధ్యతగా తీసుకుని వారి పిల్లలకు తెలుగు అలవరచాలి.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఒక తరం నుంచి మరొక తరానికి అందించే సాధనం భాష. ఆదే మనం భావి తరాలగు అందించగల తరగని, ఖర్చులేని ఆస్తి.

పిల్లలు తెలుగు నేర్చుకుంటే, తెలుగు సంఘాల “తెలుగు బడులు” అనే మహత్తర యజ్ఞం సఫలీకృతం అయినట్టే! దానికి తలిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమైనది.

 • మీ పిల్లలను తెలుగు బడిలో చేర్చండి
 • ఏ అడ్డంకి వచ్చినా పిల్లలని ప్రతివారం తెలుగు బడికి తీసుకు రండి
 • పిల్లల చేత తెలుగు homework తప్పక చేయించండి
 • పిల్లలతో తెలుగులో మాట్లాడండి

తెలుగు బడులు – లక్ష్యాలు

కేవలం వినడం, చదవడం, మాట్లాడడం తెలిస్తే భాష తెలిసినట్లు కాదు. వీటిని ప్రదర్శించగలిగిన సామర్థ్యం పెంపొందినప్పుడే భాష తెలిసినట్లు. పలు సందర్భాలలో భాషను వాడడంవల్ల భాష అలవడుతుంది. ఇటువంటి విషయాలు ఒక క్రమబద్ధంలో బోధిస్తే అలవడతాయి. తెలుగు బడులు అటువంటి పద్ధతిలో తెలుగు నేర్పడానికి ప్రత్నిస్తాయి. ఆ దిశలో కొన్ని నిర్ధిష్టమైన లక్ష్యాలను పెట్టుకుని పాఠ్యాంశాలను పిల్లలకు అందిస్తున్నాయి.

భాష

 1. ఆలోచనాత్మకత (thought provoking),
 2. భావాత్మకత (emotiveness),
 3. సృజనాత్మకత (creative thinking)

లకు సాధనం.

వీటి దృష్టితో భాషను చూచినపుడు బోధనా లక్ష్యాలు ఆయా అంశాలను సాధించగలగాలి.

“ఫలానా పాఠం వల్ల ఫలానా లక్ష్యం నెరవేరుతుంది” అని చెప్పలేము, చెప్పకూడదు కూడా. కానీ, పిల్లలకి బోధించే పాఠ్యాంశాలు, బోధనా పద్ధతి వాటిని వారికి చెప్పకుండానే అందించగలగాలి.  వాటిని మనసుని ఆకట్టుకునేవిగా, ఆకర్షణీయంగా, వికాసవంతమైనవిగా తీర్చి దిద్దాలి. ఆ పద్ధతులు పిల్లల day schools లో పద్ధతులకు దగ్గరగా ఉండాలి.

ఆ స్థూల (macro level) లక్ష్యాలను పిల్లల వయసును బట్టి కాక వారి భాషా జ్ఞానాన్ని బట్టి ఈ క్రింది విధంగా సూక్ష్మ (micro level) లక్ష్యాలగా నిర్దేశించవచ్చు.  (ఇక్కడ సూచించిన తరగతులు పిల్లల భాషా జ్ఞానాన్ని బట్టి నిర్దేశించినవి కానీ వయసును బట్టి కాదు.)

ప్రాధమిక స్థాయి బోధనా లక్ష్యాలు (కే‌జి-6 తరగతులు):

ప్రాధమిక స్థాయి పూర్తి అయ్యే సరికి పిల్లలకు కథల పుస్తకాలు చదవటం అలవడాలి. అంటే వారు స్వతంత్రంగా పుస్తకాలు చదివి, అర్థం చేసుకుని, జ్ఞానం పెంచుకోగలగాలి.

 • విన్న/తెలిసిన దాని గురించి చెప్పగలగడం,
 • విన్న దానికి ప్రతిస్పందించడం (respond),
 • చదివిన దాన్ని అర్థం చేసుకోవడం (assimilation),
 • చదివినది సొంత మాటల్లో రాయడం,
 • తప్పులు లేకుండా రాయాడం,
 • ధారాళాంగా చదవడం,
 • భాష ప్రాధమిక నియమాలు, వాక్య నిర్మాణం మొ. తెలుసుకోడం,
 • తమ సొంత అనుభవాలను, ఆలోచనలను, అభిప్రాయాలను చెప్పగలగడం/రాయడం.

ఉన్నత స్థాయి బోధనా లక్ష్యాలు (7-12 తరగతులు):

ఉన్నత స్థాయి పూర్తి అయ్యే సరికి విద్యార్థులు విమర్శనాత్మకంగా, హేతుబద్ధంగా, స్వతంత్రంగా భాషని ఉపయోగించి తమ జ్ఞానం ఇతరులతో పంచుకోగలగాలి.

 • వినడం, విన్న దానిని అర్థం చేసుకోవడం,
 • విన్న దానికి ప్రతిస్పందించడం (respond)/గోష్టి (debate),
 • విమర్శనాత్మకంగా ఆలోచించడం (analytical thinking),
 • ఆత్మ విశ్వాసంతో ప్రసంగించడం (speak with self-confidence),
 • జాతీయాలు/సామెతలు వాడడం,
 • వినే వారికి ఆసక్తి కలిగించడం,
 • భాషా నియమాలు (grammar) నేర్చుకోడం (వాక్య నిర్మాణం, అలంకారాలు, ప్రాసలు, ఛందస్సు మొ.),
 • సొంత మాటల్లో వ్యాసాలు/కథలు రాయడం,
 • సంప్రదాయాలను అర్థం చేసుకుని ప్రసంగించగలగడం.

తెలుగు బడులు – బోధనా పద్ధతులు:

తెలుగు బడి teachers లో చాలామంది University of Sydney వారు నిర్వహించిన “Certificate in Community Language Teaching” కోర్సు చేశారు. అలాగే మిగిలిన నగరాల్లో teachers అక్కడ నిర్వహించే ఇటువంటి courses చేశారు. వీటిద్వారా ప్రాధమిక విద్యాబోధనలో నూతన పద్ధతులను నేర్చుకున్నారు. వాటిని తెలుగు బడిలో ప్రవేశపెట్టారు/ పెడుతున్నారు. దీనివల్ల పిల్లలు వాళ్ళ regular (day) school లో ఎలా పాఠాలు నేర్చుకుంటారో అలాగే తెలుగు బడులలో కూడా నేర్చుకుంటారు.

తెలుగు బడి teachers అనేక conferences (NSWFCLS Annual Conference, Indian Community Languages) లలో పాల్గొని బోధనా విధానాలను పంచుకున్నారు.

వీరికి తోడు చాలా మంది తలిదండ్రులు classrooms లో volunteers గా పిల్లలచేత classwork చేయించడంలోనూ, ఆటలు ఆడించడంలోను, సంస్కృతిక కార్యక్రమాలు చేయించడంలోను అనేక విధాల తోడ్పడుతున్నారు.

Text పుస్తకాలు, workbooks, posters మొ. ఇక్కడి (Australian) వాతావరణానికి అనుగుణంగా (sensitive to local Australian environment/culture) తయారుచేయడంవల్ల, పిల్లలు విషయాలు తొందరగా గ్రహించగలుగుతున్నారు.

తెలుగు భాష, సంప్రదాయాలు విడదీయలేనివి. తెలుగు సంప్రదాయక గీతాలు, పాటలు, పద్యాలు, ఆటలు, కథలు మొ. వారికి మనోరంజకాలే కాక, భాషను అనుభవయోగ్యం చేసుకునేదుకు దోహద పడతాయి. నేర్చుకున్న వాటిని అనేక కార్యక్రమాల్లో ప్రదర్శించే అవకాశాలు కూడా పిల్లలు అందిపుచ్చుకుంటున్నారు.

తెలుగు బడులు – పరీక్షలు/Assessment

పిల్లలకు పరీక్ష పెట్టడం కేవలం వారు అనుకున్న లక్ష్యాలను ఎంతవరకు సాధించారో తెలుసుకోడానికి మాత్రమే కాకుండా, బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయి? లోపాలు ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి? వనరులు (resources) ఎలా ఉన్నాయి? వంటి అనేక విషలను కూడా అంచనా వేయగలగాలి.

 • Diagnostic Assessment – తెలుగు బడిలో చేరేటపుడు పిల్లలు ఒకే వయసు వారు ఉండరు, తెలుగు ఎంతో కొంత మాట్లాడడం, రాయడం మొ. తెలిసి ఉంటాయి. అలా చేరే వాళ్ళని ఏ level లో చేర్చుకోవాలని చేసేదే ఈ assessment.
 • Formative Assessment – చెప్పిన పాఠాలు ఎంతవరకు బోధపడుతున్నాయి అని ఎప్పటికప్పుడు తెలుసుకుందుకు, ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కారించేందుకు చేసేదే ఈ assessment.
 • Summative Assessment – ప్రతి term లోనూ జరిగే formal/informal పరీక్షల తో విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకుందుకి చేసేదే ఈ

తెలుగు బడి – Teachers

ఆస్ట్రేలియాలో తెలుగు బడి teachers స్వచ్ఛందంగా తమ సొంత కాలాన్ని వెచ్చించి పాఠాలు నేర్పడమేకాకుండా, కొత్త బోధనా పద్ధతులు నేర్చుకోడానికి కూడా తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అది వారికి మన భాష పైనున్న అభిమానానికి, దాన్ని పిల్లలకు పంచాలనే సహృద్భావానికి నిదర్శన.

అలాగే అనేకమంది తలిదండ్రులు బడి కార్యకలాపాల్లో చేదోడు వాడోడుగా ఉండి తమ అమూల్యమైన కాలాన్ని, శ్రమని వెచ్చించి సాయం చేస్తున్నారు.  

తెలుగు బడి – Students

తెలుగు బడిలో చేరే పిల్లలకు తెలుగు మాట్లాడే సామర్థ్యం వేరు వేరుగా ఉంటుంది. అది వాళ్ళు ఎక్కడ పుట్టారు? వారి ఇళ్ళలో తెలుగు ఎంతవరకు మాట్లాడతారు? ఏ వయసలో ఆస్ట్రేలియా వచ్చారు? ఇటువంటి అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంచుమించు అందరికీ Primary School లో చేరేసరికి English మాట్లాడటం వచ్చే ఉంటుంది.

ఈ వయసులో పిల్లల గ్రహింపు శక్తి, ఇతర పిల్లలతో కలిసికట్టుగా ఉండడం అనేవి ఆట పాటలతో కలుగుతాయి.

తెలుగు బడి – The Role of English

బడిలో పిల్లలు తెలుగులో మాట్లాడడాన్ని ఎంతైనా ప్రోత్సహించాలి, కానీ మాట్లాడమని నిర్బంధ పెట్టకూడదు. అలా చేస్తే నిర్మాణ దశలో వాళ్ళు నిరుత్సాహపడే అవకాశం ఉంది. అలాగే ఏదైనా వివరణ ఇవ్వాలన్నా, చర్చించాలన్నా English తో కూడిన తెలుగుని వాడడం పరిపాటి.

English భాష ని scaffold గా ఉపయోగించి తెలుగు మాటలు, వాక్యాలు పలికించడం వల్ల పిల్లలు అ-ఆ లు నేర్చుకునే దగ్గరనుంచి తెలుగు పదాలు, వాక్యాలు చదవగలుగుతారు. దీని వల్ల తెలుగు నోరు తిరుగుతుంది, పదాలు తెలుస్తాయి, మాట్లాడే అలవాటు అవుతుంది,

అక్షరాలు గుణింతాలు వచ్చిన తర్వాత English అవసరం లేకుండా తెలుగులోనే చదవ గలుగుతారు. అంతవకకు English అవసరం అంతైనా ఉంది.

తెలుగు బడి – Administration

బడిని నిర్వహించడానికి దానికి తగిన rules పాటించాలి. ఎంత చిన్న బడైనా rules ని బాధ్యతతో తప్పక పాటించాలి. పిల్లల safety కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.

బడితో సంబంధం ఉన్న ప్రతివ్యక్తి (teachers, volunteers, administrators, Executive Committee members) తెలుగు బడి Operations Manual లోని rules/regulations  తప్పక పాటించాలి.

ఆయా states లో బడులకు Local Principal లేదా Administrator అక్కడి Host Schools, State/Federal Education Departments, Associations మొ. వారితో సంపర్కంలో ఉండాలి, వారి rules ని పాటించాలి.

తెలుగు బడులలో teachers కి ఇబ్బంది లేకుండా management బాధ్యత ఒక administrator వహించాలి.

సారాంశం

తెలుగు భావి తరాలకు అందించడం అనేది ప్రతి తెలుగు కుటుంబం యొక్క బాధ్యత. దీన్ని ఒక సామాజిక లక్ష్యంగా తీసుకుని FTAA, ఈ లక్ష్య సాధనకు దోహద పడేదిగా తెలుగు బడులను  Australia అంతటా ఒక వేదికగా అందించే ప్రయత్నం చేస్తోంది. దీనిలో అందరూ భాగస్వాములైతే మన లక్ష్య సాధన సుగమమౌతుంది.

About the Author

Mallik RachakondaMallikarjuna Rao Rachakonda is a retired IT professional. Mallik is currently the National Coordinator for Telugu Schools of FTAA.

Under Let’s Learn Telugu series, Mallik has written several text books and 60+ booklets consisting of vocabulary, stories and short sentences. He has developed games, posters, puzzles and 150+ online Telugu lessons on Quizlet. All his works are sensitive to Australian environment, which the students are familiar with. He has also developed syllabus for various stages with each study nodule to achieve certain targeted “outcomes”.

The design principle of his works is to provide Telugu learning experience that is Interesting, Enticing and Smart with the motto “ఆడుతూ పాడుతూ తెలుగు నేర్చుకుందాం!

Mallik has received NTR Award 2017 from the TDA for his service towards Telugu language and culture, and received Excellence in Community Services Award 2017 from the UIA.

Send a Comment

Your email address will not be published.