ఆ పనైనా చేయనివ్వండి ప్రశాంతంగా....

ఆ  పనైనా  చేయనివ్వండి ప్రశాంతంగా....
శూన్యాన్ని విడిచిపెట్టక
వర్ణాలు  నింపి  ఖూనీ  చేయడాన్ని
కంటి చూపులు గ్రహించాయి
ఎవరికోసమూ
ఎవరూ లేరనేదే నిజం
కానీ
అందరి కోసం
అందరూ ఉండటానికి
చేసే ప్రయత్నం సహజసిద్ధం కాస్తా
మృత్యువైంది

 

ఎక్కడ ఎటు తిరిగినా
హృదయం  దొరుకుతోంది
అందులో
కొన్ని హృదయాలు మాత్రమే
మనకోసం కలిసొస్తాయి
ఉద్వేగంగా కొందరిని కదిలించి వేస్తుంది

 

 

మనసుతో  మాత్రం
చెరగిన తీరుకు కావాలంటే
జీవితం అని పేరు చెప్పే లోకం ఇది…. 

ఒక్కొక్క రాయీ తీసుకుని
ఆకాశంకేసి విసిరాను
తీరా అవన్నీ  మళ్ళీ భూమి మీదే  పడ్డాయి
ఎక్కడ  ఎటు తిరిగినా
చివరికి ఇక్కడికి  రావాలన్నదే వాస్తవం
మట్టే
మనకు అంతిమం అనేది కాదనలేని నిజం
భూమిమీద  పడ్డ  ప్రతి రాయిలోను
అంటుకున్న ఇసుకరవ్వలను తట్టినప్పుడు
నా  శిరోభారాన్నీ దింపేసాను

అయితే మనసు  చెప్తూనే  ఉంది
మరెంతో మట్టి ఉంది రాయి  పైనా అని
దానిని దులపండంలో ఉన్నాను…

నన్ను ఆ  పనైనా ప్రశాంతంగా  చేయనివ్వండి

Send a Comment

Your email address will not be published.