ఇంటింటా తెలుగు, ఇంట్లోనే తెలుగు

ఇంటింటా తెలుగు, ఇంట్లోనే తెలుగు

తెలుగేతర రాష్ట్రాలలో మరియు దేశాలలో తమ పిల్లలకు తెలుగు నేర్పడం అనేది ప్రతి తెలుగు కుటుంబానికి ఎదురయ్యే ఒక సమస్య. ప్రపంచ వ్యాప్తంగా స్థానిక తెలుగు సంఘాలు తెలుగు బడులు నడుపుతున్నాయి. అందుబాటులో ఉన్న తెలుగు బడులలో పిల్లలను చేర్చడం ఈ సమస్యకు ఒక సమాధానం. అటువంటి అవకాశం లేని పిల్లల మాట ఏమిటి?

బడినే ఇంటి నుండి నడిపితే?

ప్రతి కుటుంబం తమకు తామే ఈ సమస్యకు సమాధానం కనుగొన్నట్టవుతుంది.

ప్రతి తల్లి (తండ్రి) సహజంగా ఒక గురువే! అటువంటి తల్లిదండ్రుల సహాయంతో ప్రతి ఇంట్లో తెలుగు తరగతులు ఎందుకు నడుప కూడదు? అలా నడపడానికి కావలసిన సదుపాయాలు ఏమిటి? వాటిని సులభంగా అందుబాటులోకి ఎలా తీసుకురాగలం? వంటి ప్రశ్నల సమాధానమే మా యీ https://letslearntelugu.com.au అనే వెబ్సైట్.  అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది.

ఏమి చెప్పాలి? అనే సందిగ్ధత లేకుండా:

  1. తరగతి వారీగా పాఠాలను క్రమబద్ధం చేయడం,
  2. ప్రతి పాఠానికి లక్ష్యాన్ని నిర్ణయించడం,
  3. లక్ష్యానికి తగిన పాఠ్యాంశాలను ప్రతి పాఠానికి online ద్వారా video, audio, interactive screens, posters, worksheets, workbooks, quizzes మొదలైన పద్ధతులలో పిల్లకు సులభంగా, ఆకర్షణీయంగా అందించడం,
  4. ప్రతి పాఠ్యాంశాన్నీ పిల్లలకు పరిచయమున్న పరిసరాలను సూచించే విధంగా (sensitive to their surroundings) తయారు చేయడం,
  5. పిల్లలు చదవగలిగే రీతిలో మరియు స్వతంత్రంగా homework చేయగలిగే విధంగా వారికి పరిచయమున్న (naturally familiar) ఇంగ్షీషు భాషను scaffold గా వాడడం,
  6. పాఠాలకు అనుబంధంగా సవివరణతో శతక పద్యాలు, గేయాలు, కథలు తదితర పిల్లల పుస్తకాలను అందించడం,

మొదలైన అంశాలతో మా వెబ్సైట్ రూపు దిద్దుకుంది.

మా వెబ్సైట్ ద్వారా పిల్లలకు తెలుగు నేర్పదలచుకున్న తల్లిదండ్రులు తమకు కావలసిన పాఠ్యాంశాలను ఇంటి నుండే ఉచితంగా పొందగలుగుతారు. వారికి కావాలసినదల్లా ఒక Laptop లేదా 10” Tab/iPad, Wi-fi connection మరియు Printer.  వారానికి రెండు గంటలు వారు పిల్లలకు తెలుగు నేర్పడానికి వెచ్చిస్తే, “ఇంటింటా తెలుగు, ఇంట్లోనే తెలుగు” అనే మా నినాదానికి సాకారం చేసిన వాళ్ళవుతారు.

ఈ వెబ్సైటులో దృశ్య శ్రవణ మధ్యమాలతో కూడిన పాఠ్యాంశాలు ఉన్నాయి.  పిల్లలు తలిదండ్రులు వారాంతం వరకూ వేచి ఉండకుండా వారికి  అనుకూలమైన సమయం ఎంచుకొని తెలుగు నేర్చుకోవచ్చు.

ఈ వెబ్సైటులో ఏమైనా మార్చవలసిన లేక చేర్చవలసిన  అంశాలు ఉంటే మీ సలహాలు తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు కుటుంబాలకు ఇదే మా పిలుపు. 

రండి, కలిసి కృషి చేద్దాం, ఈ రోజే మీ పిల్లలను మా వెబ్సైట్ లో ఉచితంగా నమోదు చేయండి.

మనదైన కమ్మని తెలుగు భాషను మన పిల్లలకు అందిద్దాం.

 https://letslearntelugu.com.au

 

It’s FREE, it’s fun to learn Telugu! Enrol today!

 

రచయిత: రాచకొండ మల్లికార్జున రావు, సిడ్నీ

Send a Comment

Your email address will not be published.