కాలేజీ లెక్చరర్‌ పాత్రలో వెంకటేష్‌!

కాలేజీ లెక్చరర్‌ పాత్రలో వెంకటేష్‌!

వెంకటేష్‌ తెలుగు సినిమా అగ్రతారల్లో ఒకరిగా ఉంటూ ప్రేక్షకులను అలరించిన కథానాయకుడు. ఇప్పుడీ సీనియర్‌ హీరో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు వెంకీ. ఇందులో వెంకటేష్‌ కాలేజీ లెక్చరర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్నారని చెప్పుకుంటున్నారు. వెంకటేష్‌ గతంలో యువ వ్యాపారవేత్తగా, లాయర్‌గా, ఐపీఎస్‌ అధికారిగా చాలా పాత్రల్లో నటించారు. 1992లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సుందరకాండ చిత్రంలో తెలుగు లెక్చరర్‌గాను సందడి చేశారు. ఇందులో మీనా కథానాయికగా నటించింది. వెంకటేష్‌ని ప్రేమించే రోజా పాత్రలో అపర్ణ నటించింది. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. మళ్లీ ఇన్నాళ్ల తరువాత వెంకటేష్‌ తరుణ్‌ భాస్కర్‌ చిత్రంలో కాలేజీ లెక్చరర్‌గా కనిపించడానికి సిద్ధమౌతున్నారు. సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.