కొరటాల శివ - అల్లు అర్జున్

కొరటాల శివ - అల్లు అర్జున్

కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా

కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తన 21వ చిత్రం చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ‘నా తదుపరి చిత్రం కొరటాల శివ గారితో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. కొంతకాలంగా నేను దీని కోసమే ఎదురుచూస్తున్నాను. సుధాకర్‌ గారి మొదటి ప్రాజెక్టుకు నా శుభాకంక్షలు. శాండి, స్వాతి, నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను చూపించే మార్గం. కాగా, ఈ చిత్రంతో సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్సు ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శాండీ, స్వాతి, నట్టీలు సహా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

కాగా, ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న అల్లు అర్జున్ 20వ చిత్రం సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మరోవైపు గతంలోనే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పటివరకు షూటింగ్‌ ప్రారంభం గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఇక, బన్నీ-వేణు శ్రీరామ్‌ కాంబినేషన్‌లో దిల్‌ రాజు నిర్మాతగా ‘ఐకాన్‌-కనబడుటలేదు’ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బన్నీ కేరీర్‌లో 21వ చిత్రంగా ఇది తెరకెక్కనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఈ చిత్రం గురించి టాక్‌ వినిపించలేదు. అయితే ఈ ఏడాది బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ఆయనకు విషెస్‌ చెబుతూ ఐకాన్‌ టీమ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే తాజాగా కొరటాల సినిమాకు బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఐకాన్‌ మూవీ మరింత ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఆచార్య మూవీని తెరకెక్కిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.