దుష్ట బాణ సంచా --- శిష్ట జ్ఞానాకాంక్ష

దుష్ట బాణ సంచా --- శిష్ట జ్ఞానాకాంక్ష

 
విభజన బాణసంచా కి విరుగుడు గా విశాల భావాల తీపిని పంచాలి
అందరం ఉమ్మడి గా భాగ్య నగర నగారా మోగించాలి
ప్రాభవ మ్మందిన అఖండాంధ్రావని దీ దీపావళి యని యెం చాలి
దీపాలు వేరైనా ప్రతి దీపం లో దీపించే కాంతి ఒకటేనని గుర్తించాలి

భుర్జు కాలిఫ లెక్క పొడుగెక్క వేర్పాటు
    తాపం దె మోడె ను తార జువ్వ
చీలివేరు పడెడి చిచ్చు లెగయ నంత
    చిన్నబోయి పగిలె చిచ్చు బుడ్డి
మాది నీది యనెడి మాయచీకటి కమ్మ
    తళుకెడబాసె మతాబు కాంతి
ఆందోళన మ్ముల అదిరిపాటులమధ్య
    పసలేకమూల్గె టపాకాయ

పగల గొట్టి విర చు బాణసం చుల కీల
రగిలి తెలుగు పరువు రచ్చకెక్కె
వేరుపాటు తిమిర విలయ తాండవమేగు
వేకువనెడు దివ్వె వెలుగు లె పుడొ ?

సరిపల్లి సూర్యనారాయణ

Send a Comment

Your email address will not be published.