నాగచైతన్య నిర్మాతగా...

రాజ్‌ తరుణ్ సినిమాకు నాగచైతన్య నిర్మాత

మహేశ్‌బాబు, రామ్‌చరణ్, నాని, సందీష్‌ కిషన్‌ తదితర హీరోలు నిర్మాతలుగా మారారు. తాజాగా హీరో నాగచైతన్య నిర్మాణరంగంలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది. ‘భవిష్యత్తులో నిర్మాతను అవుతా’ అని పలు సందర్భాల్లో చైతన్య పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం తర్వాత హీరో రాజ్‌ తరుణ్, దర్శకుడు శ్రీనివాస్‌ గావిరెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు నాగచైతన్య.

Send a Comment

Your email address will not be published.