నానికి జోడీగా అను

నానికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌

నాని కథానాయకుడుగా తెరకెక్కిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్‌. ఇప్పుడు మరోసారి ఈ జోడీ కలిసి నటించనుందని టాలీవుడ్‌ టాక్. నానితో ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్‌ సాంకృత్యన్‌ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ముగ్గురు నాయికలకు అవకాశం ఉందని సమాచారం. ఈ జాబితాలోకి అను వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో సంప్రతింపులు జరుగుతున్నాయని, త్వరలోనే స్పష్టత రావొచ్చని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రంతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. నాని నటించిన ‘వి’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్‌ జగదీష్‌’ చేస్తున్నాడు. ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంతో బిజీగా ఉంది అను ఇమ్మాన్యుయేల్‌.

Send a Comment

Your email address will not be published.