నిఖిల్‌ తో అనుపమ

నిఖిల్‌ తో అనుపమ

నిఖిల్‌ తో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్

‘ప్రేమమ్’‌ చిత్రంతో సందడి చేసిన నటి అనుపమ పరమేశ్వరన్‌. ఆ తరువాత ‘శతమానం భవతి’ చిత్రంలో శర్వానంద్‌తో కలిసి అలరించింది. ప్రస్తుతం నిఖిల్‌ కథానాయకుడిగా వస్తోన్న ‘18 పేజెస్’‌ చిత్రంలో కథానాయికగా నటించనుందని సమాచారం. పల్నాటి సూర్యపత్రాప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కథను అందించారు. సినిమాలో కథానాయికగా పలువురి పేర్లు అనుకున్నా చివరికి ఆ అవకాశం అనుపమే దక్కిందని చెప్పుకుంటున్నారు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. రొమాంటిక్‌ ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా గోపీసుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కరోనా వైరస్‌ పరిస్థితులు కుదుటపడిన తరువాత చిత్ర షూటింగ్‌ మొదలుకానుందట. అనుపమ తమిళంలో ‘తల్లి పొగాథే’ అనే చిత్రంలో నటిస్తోంది.

Send a Comment

Your email address will not be published.