నిశ్శబ్డం

నిశ్శబ్డం

పక్కవాడిని పలుకరిద్దామని తలుపు తట్టా…
పలుకరించాడు కానీ అదోలాచూస్తే వెనుకకు వచ్చా… …

మాలుకు పోయి మనసును దారి మళ్లించాలనుకున్నా…
మనుషుల మూకను చూసి మనసు మరల్చుకున్నా.. …

శివ-విష్ణువుల వద్దకు పోయి గోడు చెప్పకుందా మనుకున్నా…
భక్తుల కిటకిటలతో ముఖా-ముఖి మాట్లాడ లేకపోయా….

స్నేహితులెవరైనా ఖాళీగా ఉన్నారేమో అని ఫోన్ తీసా…
ఇది వీక్డే.. వీకెండ్ కాదే అని తెలిసి చతికిలపడ్డా…. …

గార్డెనింగ్ చేద్దామని పార-పలుగు షెడ్ లోంచి తీసి చూసా.. .
ఆఘ-మేఘాలతో వర్షం వచ్చి మూడు పోగా చతికిల పడ్డా… .. ..

పీకమీద స్వారీ చేసే పనులున్నాయేమో అని క్యాలెండర్ చూసా…
క్యాలెండర్లో ఎంటర్ చేయలేదని తెలిసి నివ్వెరపడ్డా….

ఇక ఏదీ లాభం లేదని మనసును లోపలకు త్రిప్పా…
కాసేపటికి నిశ్శబ్డములో నన్ను నేను మైమరచా….

Send a Comment

Your email address will not be published.