పక్షులకు షవర్ బాత్

పక్షులకు  షవర్ బాత్

పరిశ్రమలున్న ప్రాంతంలో పొరపాటున మనిషి ఏదో ఒక పరిశ్రమ నుంచి రోడ్డు మీదకు వచ్చిన చమురులో జారి పడితే వెంటనే అతనిని లేపి అవసరమైతే చికిత్స చేయడం లేదా శుభ్రం చేయవచ్చు. కానీ ఒక ధనవంతుడి ఇంట్లో ముద్దుల పావురమో చిలకకో ఏదైనా ప్రమాదం జరిగితే చేత్తో తీసుకుని కొన్ని గంటలపాటు దానికి వైద్యమో లేదా ఇతర సేవలు చేయవచ్చు. అయితే ఒకప్పుడు అతి జాగర్తకు పోతే అ పక్షి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం లేకపోలేదు.

స్కాట్లాండ్ లో పక్షుల రక్షణ శరణాలయం ఒకటుంది. ఈ సంస్థ ఓ ప్రత్యేకమైన వాషింగ్ యంత్రం తయారు చేసింది. తగిన సౌకర్యాలతో ప్రత్యేకించి తయారు చేసిన ఈ యంత్రం కోసం ఏర్పాటు చేసిన ఓ పైప్ లో పక్షిని కూర్చోబెట్టి మరొక పెద్ద పాత్రలోకి దానిని దింపుతారు. పక్షుల రెక్కలూ తల ఏ ప్రమాదమూ లేకుండా బయటకు కనిపిస్తుంటాయి. ఆ తర్వాత షవర్ ఆన్ చేయగానే నీరు బయటకు వచ్చి పక్షిని శుభ్రం చేస్తుంది. ఆ పక్షి ఒంటి మీద ఒక్క రవ్వంత మురికి గానీ కనిపించదు ఇలా షవర్ బాత్ స్నానం చేసే పక్షులు ఎంతో ఉత్సాహంతో ఉంటాయట ఆ రోజంతా అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

– యామిజాల

Send a Comment

Your email address will not be published.