పర్యావరణ పరిరక్షణలో ప్రమథ గణం

IMG-1331

భారతీయ సంస్కృతీ సాంప్రదాయంలో భాగంగా ఆది దేవుని పండగ అపూర్వమైనది. అపురూపమైనది. ఈ పండగను వర్ణించాలంటే కొన్ని గ్రంధాలు వ్రాయాలి. భారతీయుల్లో సింహభాగం వినాయక చవితి పండగను భక్తీ శ్రద్ధలతో జరుపుకోవడం పరిపాటి. దక్షిణ భారత దేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో ఈ పండగ ప్రాముఖ్యత ఎక్కువ.

సొంత గడ్డకి 10,000 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ప్రాశ్చాత్య దేశానికి వచ్చి పర భాషా సంస్కృతితో సహవాసం చేస్తూ మన భాషను, సంస్కృతిని కాపాడుకోవాలన్న తపనతో కాన్బెర్రా నగరంలో అక్కడి తెలుగు సంఘం అధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పిల్లల చేత మట్టితో గణేశ విగ్రహాలు తాయారు చేయించడం ఎంతో ముదావహం.

ఈ ప్రక్రియలో ముఖ్యంగా రెండు లక్ష్యాలున్నాయి.
1. మట్టితో విగ్రహాలు చేయించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం.
2. భావితరాలకు మన సంస్కృతిని నేర్పించడంలో కృతక్రుత్యులవ్వడం

IMG-20190902-16

0e93e9c8

అలాగే విఘ్నాధిపతి పిల్లల మునివేళ్ళ మధ్య పారవశ్యం చెంది పులకరించిపోవాలని, పిల్లలే ప్రమథ గణాలుగా పరవసించాలని తెలుగు సంఘం సదుద్దేశ్యంతో ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది.

ప్రకృతి పునరుజ్జీవనానికి ప్రధాన వనరులైన మట్టి, నీటితో ఒక ఆకృతికి జీవంపోసి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ మూర్తిని పరి పరి విధాలుగా కొలిచి తమ దైనందిన కార్యక్రమాలను, ఆలోచనలను ప్రతి ఏటా క్రమబద్ధీకరించుకొనే ఒక అతి ప్రాచీన సాంప్రదాయ ప్రక్రియే వినాయక ప్రతిమ ప్రతిష్ట మరియు నిమజ్జనం.

తెలుగు సంఘం కాన్బెర్రా ప్రతి సంవత్సరం వినాయక చతుర్థి సంధర్బంగా పర్యావరణ పరిరక్షణను ముందు తరాలకు వివరించాలన్న సదుద్దేశ్యముతో నిర్వహిస్తున్న “మట్టి వినాయక ప్రతిమ – పిల్లలతో” కార్యక్రమం అందరి మన్ననలను అందుకున్నది.

పదుల సంఖ్యలో పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంతో వారు ప్రతిమలను తయారుచేసిన విధానం, ఆ క్రమంలో వారు ఆనందించిన తీరు అనిర్వచనీయం. ఇటువంటి కార్యక్రమాన్ని ఎంతో నిబద్దతతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న తెలుగుసంఘం కాన్బెర్రా సభ్యులు అభినందనీయులు.

ఈ కార్యక్రమానికి విచ్ఛేసిన పిల్లలకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇతరత్రా కారణాలతో, మరియు పనుల ఒత్తిడితో కార్యక్రమానికి రాలేకపోయిన తెలుగువారందరికీ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యుల తరపున అధ్యక్షులు శ్రీమతి మంజుగారు శుభాకాంక్షలు తెలిపారు.

హాయ్ హాయ్ నాయకా!
జై జై వినాయకా!!
విఘ్నాలకు విరోధివై
అపజయాలకవరోధమై
మా జీవితాలకువెలుగై,
నిలిచి, దారినిచూప
ఆత్మస్వరూపుడవై వెలసిన
ఓ ప్రమథ గణనాధా!!
ఉండ్రాళ్లపై దండెత్తి
కమ్మని నెయ్యి,
కడు ముద్దపప్పు,
కడుపారఁగ సేవించి
మము దీవించిగ రావయ్యా
ఓ బుజ్జి గణేశా!!

–రుద్ర ప్రసాద్ కొట్టు, కాన్బెర్రా

IMG-1322

Send a Comment

Your email address will not be published.