పవన్‌తో అనుష్క

క్రిష్ దర్శకత్వంలో పవన్‌తో నటించనున్న అనుష్క

Pavan Anushkaపవన్‌ కల్యాణ్‌తో సరసన అనుష్క నటించే అవకాశం ఉందటున్నాయి సినీ వర్గాలు. పవన్‌ హీరోగా క్రిష్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో పవన్‌ సరసన నటించే హీరోయిన్‌ ఈమెనే అంటూ చాలామంది పేర్లు వినిపించాయి. తాజాగా ఆ జాబితాలో అనుష్క చేరింది. ఈ సినిమాలో నాయికగా అనుష్కను తీసుకునే ప్రయత్నంలో ఉందట చిత్ర బృందం. ఇప్పటికే అనుష్కకు కథ వినిపించారని, ఆమె కూడా పచ్చ జండా ఊపే అవకాశాలున్నాయని టాక్‌. మరి అనుష్కనే ఫైనల్‌ చేస్తారా? అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. గతంలో క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది అనుష్క. మరోసారి ఈ కాంబినేషన్‌ అనగానే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. కరోనా కారణంగా ప్రస్తుతం వాయిదా పడింది. ‘పవన్‌ 27’ వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ పేరు ప్రచారంలో ఉంది.

Send a Comment

Your email address will not be published.