ప్రపంచం లోనే నెంబర్ వన్

hyderabad airportజి.ఎం.ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్వహణలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రపంచ నెంబర్ వన్ ఎయిర్ పోర్ట్ అవార్డు ట్రోఫీ లభించింది. ఏటా 50 లక్షల నుంచి 1.5 కోట్ల ప్రయాణికులు రాకపోకలు సాగించే కేటగిరీలో ఈ పురస్కారం లభించింది. గత మంగళవారం మారిషస్ లోని పోర్ట్ లూయీలో జరిగిన 27 వ ఏ.సి.ఐ-ఆఫ్రికా ప్రాపంచిక వార్షిక సాధారణ సదస్సు ప్రదర్శనలో భాగంగా ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ ఏంజెలా జితేన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయ సి.ఈ.ఓ ఎస్.జె.కె. కిషోర్ ఈ ట్రోఫీని అందుకున్నారు.

Send a Comment

Your email address will not be published.