ప్రభంజనం సృష్టిస్తున్న ‘ఆర్.‌ఆర్.‌ఆర్’

ప్రభంజనం సృష్టిస్తున్న ‘ఆర్.‌ఆర్.‌ఆర్’‌ టీజర్‌

రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). చిత్రానికి సంబంధించిన ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన రామరాజు ఫర్‌ భీమ్‌ టీజర్‌ సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన 24 గంటల్లోనే 9.37లక్షల లైక్స్ వచ్చాయి. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్ సంపాదించిన దక్షిణాది చిత్ర టీజర్‌గా రికార్డు సొంతం చేసుకొంది. టీజర్లో ఎన్టీఆర్‌ శరీర దేహధారుడ్యంతో పాటు, అభినయం కూడా చాలా బాగుందని కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో వచ్చిన భీమ్‌ ఫర్‌ రామరాజుకు ఇప్పటి వరకు 7.5లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ విధంగా కేవలం పాత్రల పరిచయానికే ఇంత ఆదరణ లభిస్తుంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనే ఊహాగానాలు మొదలైయ్యాయి. మొత్తం మీద జక్కన్న స్ట్రాటజీ చాలా గొప్పగా ఉంటుందని కూడా అనుకుంటున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అలియాభట్‌తో పాటు హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్ నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్న చిత్రానికి కీరవాణి సంగీత స్వరాలు సమకూరుస్తుండగా, కె.కె.సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రాఫర్ ‌గా పనిచేస్తున్నారు. చిత్రంలో అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Send a Comment

Your email address will not be published.