ప్రశాంతత

ప్రశాంతత
ప్రశాంతత లేదని అనుకోవడానికి కారణం
మన మనస్సు
ఆలోచనలు శ్రుతి తప్పకుంటే
మనస్సు స్థిరంగా ఉన్నట్టే
అప్పుడు ఆత్మ స్వరూపం తప్పక వికసిస్తుంది
అందుకే
ఆలోచనల వెంబడి
పరుగులు తీయకూడదన్నది
విజ్ఞుల మాట
 ఆలోచనలు
ఎక్కడ పుడుతున్నాయో
తరచి చూడాలి
అదే ధ్యానం, యోగం, సర్వమూ
ఆలోచనల మూలాన్ని కనుగొంటే
మన నిజమైన స్థితి అర్ధమవుతుంది
మనం ఎవరమనేది బోధపడుతుంది
మనల్ని మనం తెలుసుకుంటే
ఆ తర్వాత
ప్రశాంతత, ఆనందం తప్ప
మరేవీ ఉండవు
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.