బాలకృష్ణతో ఉత్తరాది కథానాయిక!

బాలకృష్ణ చిత్రంలో ఉత్తరాది కథానాయిక!

Balakrishnaఎమోషనల్‌ చిత్రాలకు – డైలాగ్‌లో చెప్పడంలో తెలుగు హీరోల్లో బాలకృష్ణది ప్రత్యేకమైన శైలి. ప్రస్తుతం ఆయన బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కథానాయికలు ఎవరనేది ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదు. ఆ మధ్య కొంతమంది బాలీవుడ్‌ భామలతోపాటు తెలుగు కథానాయికల పేర్లు కూడా వినిపించాయి. తాజాగా ఈ చిత్రంలో ముంబైకి చెందిన కొత్తనటిని ఎంపిక చేయాలని భావిస్తున్నారట. చిత్ర దర్శకుడు బోయపాటి మాత్రం ఇందులో నూతన కథానాయికను పరిచయం చేస్తున్నట్లు గతంలోనే ఓ ప్రకటన చేశారు. అందుకు అనుగుణంగానే ఉత్తరాది మోడళ్లతో సంప్రదింపులు కూడా జరిపారట. త్వరలోనే సినిమాకి సరిగ్గా సరిపోయే ఆ కొత్తభామను ఖరారు చేయనున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ని ప్రతినాయకుడిగా తీసుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే చిత్రబృందం సంజుతో కూడా సంప్రదింపులు జరిపారని, అందుకు సంజయ్‌ కూడా సానుకూలత వ్యక్తం చేశాడని వార్తలొస్తున్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఉధృతి తగ్గిన తరువాతే చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సీనీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Send a Comment

Your email address will not be published.