ఒకరోజు సాయంత్రం ఒక యువకుడు భగవాన్ రమణ మహర్షి దగ్గరకు వచ్చాడు. ముఖం చూస్తే అతను చాలా అమాయకుడిలా కనిపించాడు.
ఉదయం తొమ్మిది గంటలకు అతను భగవాన్ ని దర్శించుకున్నాడు.
“స్వామీ, నేను పది నెలల క్రితం మీ దర్శనం చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టింది. వెంటనే బయలుదేరి మీ వద్దకు వచ్చాను. ఇక ముందుకూడా ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలి అనిపిస్తే వెంటనే బయలుదేరి రావచ్చా?” అని అత్బు భగవాన్ ని అడిగాడు.
అప్పుడు భగవాన్ “జరిగేది జరుగుతుంది. హరగానిది జరగదు. ఏదైనా ప్రాప్తం బట్టీ నడుస్తుంది. ముందెప్పుడో జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడే ఆలోచించడం దేనికీ?” అన్నారు.
అతను ఆగలేదు.
మళ్ళీ అతను అడిగాడు “బుద్ధిపుడితే వెంటనే నేను బయలుదేరి మీ దగ్గరకు రావచ్చా?” అని.
“భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉంటె కార్యం తానుగానే జరిగిపోతుంది” అని అన్నారు భగవాన్.
అప్పుడు అతను “బుద్ధి పుట్టగానే క్షణమైనా ఆపుకోలేకపోవడం వొట్టి భ్రాంతేనా?” అని అడిగాడు.
భగవాన్ చిరునవ్వుతో అక్కడే ఉన్న సూరి నాగామ్మతో “ఇతను గతంలో ఇక్కడికి వచ్చేరట. ఇప్పుడు రావాలనిపించి వెంటనే వచ్చేరట. మల్లె అనిపిస్తే రావచ్చా అని నన్ను అడుగుతున్నారు…” అని అన్నారు.
ఆ వెంటనే అతను “చూడాలనిపించినప్పుడు ఒక్క క్షణమైనా ఆపుకోలేకపోతున్నాను…అది వొట్టి భ్రాంతేనా? అని అడుగుతున్నానమ్మా?” అని అన్నాడు.
సూరి నాగమ్మ “మహాపురుషుడి సందర్శనం చేసుకోవడం భ్రాంతి ఎలా అవుతుంది? పోగొట్టుకోవలసిన భ్రాంతులు మరెన్నో ఉండగా ఇదొక్కటే భ్రాంతిగా తోచిందా మీకు?” అని అడిగారు.
– జయా