మీ కోసం...

మీ కోసం...

దేవుడు మనిషి

దేవుడిని చూసి మనిషి అడిగాడు – “నువ్వు సర్వ శక్తిమంతుడవు కదా….పది లక్షల రూపాయలు ఉన్నట్టుండి నీకు దొరికితే దానికి ఎలా విలువ కడతావు?” అని.

దేవుడు జవాబిచ్చాడు – “అది నాకు ఒక్క పైసాతో సమానం” అని చెప్పాడు.

“వెయ్యి  సంవత్సరాలు మీకు ఏపాటిది?”  అని మనిషి ప్రశ్న.

దేవుడు “అది నాకు ఒక్క క్షణంతో సమానం” అన్నాడు.

అత్యాశ కలిగిన మనిషి దేవుడితో “నాకు ఒక పైసా ఇవ్వండి చాలు” అన్నాడు.

దేవుడు నవ్వుతూ “అంతేగా…ఒక క్షణం నిరీక్షించు” అని అదృశ్యమయ్యాడు.

 

దేవుడు ఎక్కడ?

“దేవుడు లేడు” అన్నాడు నాస్తికుడు.

“దేవుడు ఉన్నాడా?” అని అడుగుతున్నాడు ఓ మతవాది.

“దేవుడు రాతిలో ఉన్నాడు!” అన్నాడు విగ్రహారాధన చేసే వ్యక్తి.

“దేవుడు నాలో ఉన్నాడు” అన్నాడు తత్వజ్ఞాని.

“నేనే దేవుడు” అన్నాడు అహంకారుడు.

కానీ “దేవుడు ఇక్కడే ఉన్నాడు” అని ఓ ఏకాభిప్రాయానికి ఇప్పటి వరకు రానే లేదు మానవ సమాజం.

 

మేఘం

నిర్మలమైన ఆకాశంలో ఓ చిన్న మేఘం తేలుతూ పోతోంది. ఇంజన్ డ్రైవర్ దానిని చూసి ఆస్వాదించి ఇలా అన్నాడు –

“ఆహా! ఈ చిన్న మేఘం నా ఇంజన్ లో నుంచి వచ్చే  పొగ లాగా ఎంత అందంగా ఉందో” అన్నాడు.

బేకరీ దుకాణదారు “కాదు కాదు, అది నా కోటలోని రొట్టెలా ఉంది” అన్నాడు.

పక్కన ఉన్న  చెప్పులు కుట్టే వ్యక్తి చెప్పాడు – “చెప్పులా పొడవైన రూపంలా  ఆ మేఘం కనిపిస్తోంది”  అన్నాడు.

ఈ ముగ్గురూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ పక్కనే నడుం వాల్చిన ఓ సోమరిపోతు “పనీ పాటా  లేకుండా ఉన్న మీరందరూ  మేఘం ఇలా ఉంది అలా ఉంది అని చెప్తున్నారా? అది ఎలా  ఉంటే మీకేమిటీ …….మీ మీ పనులు చూసుకోండి.  నేను పడుకోవాలి” అన్నాడు బద్దకంగా.

మహిమ

Send a Comment

Your email address will not be published.