మురళీ ముషాయిరా

ప్రేమికులు కళ్ళతో మాట్లాడు కుంటారు
కవులు కలంతో మాట్లాడు తుంటారు
ఇద్దరు తెలుగువాళ్ళు కలిస్తే మాత్రం
ఎందుకో మరి ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటారు

పరిశుభ్ర భారతావని గాంధీజీ కల
జన జాగృతితో పారేద్దాం చెత్తను ఆవల
కరసేవ కొనసాగిద్దాం కోట్లాది చేతుల
స్వచ్ఛభారత్ మెరవాలి నలుదిక్కుల

పోతన కాళోజీ మా వాళ్ళని, వేమన నన్నయ మీ వాళ్ళని
అచ్చులు హల్లుల అచ్చ తెనుగును పంచుకుని తెంచొద్దు
దేశ భాషలందు లెస్స అయిన మాతృభాషను మరవొద్దు
తెలుగు భాష స్థానికతను సార్వజనీకతను చెరపొద్దు

ప్రకృతి సింగారాలు చిమ్మే హంగులరంగులు
ప్రేమరంగు జోడిస్తే పొంగి పొరలు సొబగులు
మిత్రులతో అనుభవించింది ఇక చాలు
ఇకపై శతృవులను ప్రేమించడం మేలు

Send a Comment

Your email address will not be published.