వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి

వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి

నటి త్రిషా పెళ్లి త్వరలో జరగబోతోంది. నవంబర్ 16వ తేదీన త్రిషా నిశ్చితార్ధం చెన్నైలో కాబోయే భర్త వరుణ్ మణియన్ నివాసంలో జరిగింది. అయితే ఆమె ఈ విషయాన్ని వెల్లడించ లేదు. పెద్దలే చెప్తారని మీడియా వారికీ సూటిగా జవాబు ఇవ్వకుండా మౌనం వహించారు. టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా తో త్రిషా సన్నిహితంగా ఉంటున్నారని కొన్ని రోజుల క్రితం వరకు కొన్ని వార్తలు వచ్చినప్పటికీ చివరికి త్రిషా వరుణ్ ని తన భర్తగా నిర్ణయించుకున్నారని తెలిసింది.

వరుణ్ మణియన్ ఒక బిజినెస్ మ్యాన్. ఆయన తల్లి రంజిని. ఆమె గ్లోబల్ అడ్జెస్ట్ మెంట్స్ సంస్థకు సి ఈ ఓ . వరుణ్ న్యూయార్క్ వర్సిటీలో డిగ్రీ చేసారు. ఆయన రెడియన్స్ రియాల్టీ డెవలపర్స్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. ఇదొక ప్రాపర్టీ సంస్థ.

అలాగే వరుణ్ మరొక సంస్థను కూడా నడుపుతున్నారు. ఆ సంస్థ పేరు రెడియన్స్ మీడియా గ్రూప్. ఇదొక ప్రొడక్షన్ సంస్థ. ఆయన ఒక తమిళ సినిమా (కావియ తలైవి) కు సహా నిర్మాత. వరుణ్, త్రిషాల పెళ్లి బహుశా వచ్చే ఏడాది మార్చి నెలలో జరగవచ్చని ఆమె సన్నిహిత వర్గాల మాట.

త్రిషా నిశ్చితార్దానికి అటూ ఇటూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారని సమాచారం.

Send a Comment

Your email address will not be published.