వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ గా విజయ్‌ దేవరకొండ

imgc43bవిజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ గా వస్తున్నాడు. దీన్నిబట్టి అతను ఏ స్థాయిలో తన ప్రేయసి పట్ల ప్రేమ కనబరుస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ విజయ్‌ ప్రేయసి ఎవరంటే.. ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్‌ ట్రెసా, ఇజాబెల్లా లెయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు. ఈ వెండితెర ప్రేమకథకు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కేఎస్‌ రామారావు సమర్పణలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్‌ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సున్నితమైన కథాంశంతో క్రాంతి మాధవ్‌ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మా కథకు తగ్గ టైటిల్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నాం. ఈ నెల 20న ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: జయకృష్ణ గుమ్మడి, ఆర్ట్‌: సాహి సురేశ్‌.

Send a Comment

Your email address will not be published.