వాటా తెలుగుబడి రెండవ వార్షికోత్సవం

వాటా తెలుగుబడి రెండవ వార్షికోత్సవం

Wata1ప్రవాసంలో నివాసమైనా మన వాసనలే ఆదర్శం. మనందరినీ కలిపే అమ్మ భాషే కమనీయం. ఆస్వాదిస్తే అదో సుగంధం. మన మూలాలకు మూలధనం. మన నడతకు మార్గదర్శకం.

రెండేళ్ళ అవిరామ కృషి. అలుపెరుగని ప్రయాణం. అవిశ్రాంత గమ్యం. అక్షరమే లక్ష్యం.

20 మంది పిల్లలతో మొదలైన తెలుగుబడి ఈ రోజు 42 మంది పిల్లలతో రెండు కేంద్రాల్లో తెలుగు నేర్చుకుంటున్నారు.

సాంకేతికత నిత్య జీవితాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో మాతృ భాషపై మమకారంతో చిన్నారులు పక్షపాతంలేని అక్షర సుగంధాలను ఆస్వాదిస్తూ అమ్మ భాషలోని మాధుర్యాన్ని అందరికీ పంచిపెడుతూ ఎంతో ఇష్టంగా తెలుగు భాషని నేర్చుకుంటున్నారు.

Wata7Wata5

 

 

 

 

 

వెస్ట్రన్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారు నిర్వహిస్తున్న తెలుగుబడి రెండవ వార్షికోత్సవం ఈ నెల 19వ తేదీన వాటా కార్యవర్గ సభ్యులు, గవర్నెన్స్ బోర్డ్ సభ్యులు, మాజీ వాటా సంఘం అధ్యక్షులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సంఘంలోని ఇతర ప్రముఖుల సమక్షంలో అత్యంత ఉత్సాహంతో జరుపుకున్నారు.

మన సాంప్రదాయాలను భావితరాలకు సమూలంగా అందివ్వాలన్న తలంపుతో ప్రార్ధనా గీతంతో మొదలైన కార్యక్రమం ఆద్యంతమూ రెండు బడులలో చదువుకుంటున్న పిల్లల కార్యక్రమాలతో అలరారింది. కృష్ణ-గోపికల నృత్య రూపకం, ఫాన్సీ డ్రెస్, పాటలు, శ్లోకాలు, హాస్య నాటికలు, పరమానందయ్య శిష్యుల కధ, కోలాటం, అల్లూరి సీతారామరాజు మొదలైనవెన్నో అంశాలు తెలుగుబడి పిల్లల ప్రదర్శించి అతిదులందరినీ అబ్బురపరిచారు.

వాటా అధ్యక్షులు శ్రీ వసంత కుహలూరి గారు అతిధులందరికీ స్వాగతం పలుకుతూ తెలుగు భాషా ఔన్నత్యాన్ని కొనియాడి మరే ఇతర భాషలో లేని అవధాన ప్రక్రియ తెలుగు భాషకు చెందడం మనకు గర్వకారణం అన్నారు.

Wata2Wata3

 

 

 

 

 

అతిధి ఉపన్యాసకులుగా విచ్చేసిన డా. శ్రీధర్ ఆచార్య మన పిల్లలు తెలుగు ఎందుకు నేర్చుకోవాలన్న అంశంపై ఉద్వేగపూరితమైన మరియు స్పూర్తిదాయకమైన సందేశాన్నిచ్చారు. ముఖ్యాతిధిగా విచ్చేసిన వాటా ముఖ్య సలహాదారు డా. రజని పలాడి గారు తెలుగుబడి నిర్వాహకులు చేస్తున్న కృషిని అభినందించారు. పిల్లలందరికీ సెర్టిఫీకేట్లు అందివ్వడం జరిగింది.

శ్రీమతి పద్మ బోయపాటి గారు తెలుగుబడి వార్షిక నివేదికను సభకు సమర్పించారు. శ్రీ చంద్ర ఇందుర్తి గారు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Send a Comment

Your email address will not be published.