వాటా రాగసుధామృతము

IMG_6474
IMG_64851
IMG_6577
పాడినవారు, తాళం వేసిన వారు, ఆస్వాదించిన వారు, కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినవారు అందరూ వారే. అంతా వారై ఎంతో సంతోషంగా నిర్వహించిన కార్యక్రమం. ఇందులో పిల్లలు ముఖ్యంగా తెలుగు భాషను నేర్చుకుంటున్న పిల్లలు కళాత్మకంగా వాద్యాలు వాయించడం, పాటలు పాడటం ఎంతో ముచ్చటగా అనిపించింది. ‘తెలుగు నేర్చుకుంటే నాకేంటి?’ అని ప్రశ్నించే వారికి ఇది చక్కటి ప్రోత్సాహం. అభ్యసించిన చదువు, నేర్చుకున్న సంస్కృతీ మన జీవన సరళినే మార్చేందుకు తోడ్పడతాయి. బహుభాషా తత్వము, బహుళ సంస్కృతీ సాంప్రదాయము సమున్నతంగా ఆచరిస్తున్న ఈ దేశంలో మన ఉనికిని కాపాడుకుంటూ భావితరాలకు అందిస్తున్న తీరు అభినందనీయము.

IMG_6727
IMG_6687

నిన్న ‘అక్షర దీపానికి ముచ్చటగా మూడేళ్ళు’ అన్న శీర్షికన వాటా తెలుగుబడి గురించి మనం విన్నాం. నేడు వారు చేసిన రాగాలాపన ఆస్ట్రేలియాలో పశ్చిమ తీరాన పరవశంతో వీచిన పవనాలుగా మనందరి హృదయాలను తాకాయి. మృదంగ వాద్యాలు మదిని పులకరింపజేసాయి. వీణా గానాలు మైమరిపించాయి. మనసు రాగాలు మత్తెక్కించాయి.

వాటా సభ్యులు నిర్వహించిన ‘రాగసుధ’లో వయోలిన్, వీణా, మృదంగం, గాత్ర సంగీతంతో ప్రముఖంగా పిల్లలు పెద్దలు కలసి చేసుకున్న మంచి కార్యక్రమం. అందరూ పాడుకొని ఆనందడోళికల్లో తేలియాడారు. ఇందులో భక్తీ గీతాలు, దేశ భక్తి గీతాలు, సాహిత్యపరమైన గీతాలు, అన్నమాచర్య గీతాలు, చిత్ర గీతాలు ఇలా అన్నిరకాల సంగీత స్వరాలను ఆలపించి మన తెలుగు భాషా వాజ్మయంలోని స్వర్ణ యుగాన్ని మరోమారు చుట్టి వచ్చారు.

కార్యక్రమానికి శ్రీమతి డా. రజని పలాడి గారు మరియు శ్రీమతి లక్ష్మి గారు దీపప్రజ్వలన చేసారు. Councillor Mrs Yaso Ponnuthurai గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

అధ్యక్షులు శ్రీ శ్రవణ్ లంకపోతు గారు స్వాగత వచనాలు పలుకుతూ ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని సభ్యులందరికీ పిలుపునిచ్చారు. శ్రీ శ్రీనివాస్ కంబల గారు వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది.
IMG_6525

 

Send a Comment

Your email address will not be published.