విశ్వమానవ సంక్షేమమే వేదం

mathematicsవేదం ఏం చెప్పినా సమస్త మానవాళిని, విశ్వాన్ని ఉద్దేశ్యించి చెప్తుంది. ‘మనుర్భవ – కృణ్వంతు విశ్వమార్యం’ : ముందు మనుష్యులుగా మారండి, విశ్వం మొత్తాన్ని శ్రేష్టతరమైనదిగా చేయండి అంటుంది.

‘న సామా యజ్ఞో భవతి’ – సామవేదం లేనిదే యజ్ఞమే లేదు అని చెప్పబడింది. కృష్ణుడు కూడా గీతలో ‘వేదానాం సామవేదోస్మి’ – నేను వేదాల్లో సామవేదాన్ని అన్నాడు.

వేదం ప్రత్యేకించి ఒక మతానికి గాని భావజాలానికి గాని పరిమితం కాదు. ఆ రకంగా చూసుకున్నప్పుడు అది ఒక మతగ్రంధం కూడా కాదు, కేవలం తత్త్వం గురించి, ధర్మాల గురించి బోధ చేస్తుంది.  మానవులు అందరు ఒక కులానికి, ఒక మతానికి, ఒక భాషకు, ఒక ప్రాంతమునకు, ఒక రాష్ట్రమునకు, ఒక దేశానికి ఎటువంటి ప్రాపంచిక సంబంధ బాంధవ్యాలు  లేక, కేవలము ఒకే ఒక విశాల విశ్వ కుటుంబ సభ్యులము అనే భావన కలిగించేదే వేద విజ్ఞానము.

వేదాలలో గణిత శాస్త్రం గురించి కొన్ని నిజాలు …

లంబకోణ త్రిభుజానికి సంబందించి పైథాగరస్ కనిపెట్టాడని మనమంతా చెప్పుకునే సిద్ధాంతం బౌద్ధాయన శుల్బ సూత్రాలలో ఉంది.  గణితశాస్త్రంలో మనం తరచూ వాడే ‘ఇన్ఫినిటీ’ గురించి ‘పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే..’ శ్లోకంలో ఎప్పుడో చెప్పేశారు మన పెద్దలు.

త్రికోణమితిని మనవాలు ఎప్పుడో కనుగొన్నారు. ఆర్యభట్ట, వరాహమిహిరుడు వంటివాళ్ళు సైన్, కాస్ విలువలనూ చెప్పారు.

స్టీమ్ అనే పదం పాణిని రచించిన అష్టాధ్యాయిలో కనిపిస్తుంది.  గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కంటే ముందు 12 వ శతాబ్దానికి చెందిన భాస్కరాచార్యుడు తన సిద్ధాంత శిరోమణిలో భూమ్యాకర్షణ సిద్ధాంతంగా చెప్పారు.  భౌతిక, రసాయన, వైద్య, వైమానిక … ఇలా ఏ శాస్త్రం తీసుకున్నా తత్సంబంద సమాచారం మన వేదాల్లో కనిపిస్తుంది.”

అటువంటి వేదాలు కనుమరుగై కాలచక్రంలో కలిసిపోతున్న ఆధునిక కాలంలో ‘మన’ వేదాలు మనకి దూరమయ్యాయా లేక మనం దూరం చేసుకున్నామా అన్న మీమాంసకు లోనై దైవ సన్నిధిలో యాదృచ్చికంగా ఒక దివ్యానుభూతిని పొంది వేద విజ్ఞానం మనకే కాకుండా భావి తరాలకు బాట వేస్తుందన్న సంకల్పంతో స్వతహాగా పరిశోధనా రంగంలో నిష్ణాతులైన శ్రీ రేమెళ్ల అవధానులు గారు వేద పరిశోధనకు శ్రీకారం చుట్టారు.

చిన్నతనంనుండీ వేద పఠనంలో అమితాసక్తి ఉన్న శ్రీ అవధానులు గారు భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా కొన్నాళ్ళు పనిచేసిన తదుపరి కంప్యూటర్ రంగంలోకి అడుగు పెట్టారు.  భారతీయ భాషల్లో మొదటిసారిగా 1976 లో తెలుగు భాషను కంప్యూటర్ లోకి ప్రవేశపెట్టిన ఘనత శ్రీ అవధానులుగారిదే.

1131 శాఖలున్న వేదాలు ప్రస్తుతం 7 శాఖలే మిగిలాయన్న వార్త గుండెను పిండినట్లు చేసి ఈ శాఖలు కూడా అంతరించిపోవడానికి అట్టే సమయం పట్టదని ఉన్నవాటిని రికార్డింగ్ చేయడం శ్రీ అవధానులుగారు చేసిన మొదటి పని.  తదుపరి వాటిని కంప్యూటర్ లో పొందుపరచడం జరిగింది.  ఈ ప్రక్రియకు అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ గారు ఎంతో ప్రశంసాపూర్వక ప్రోత్సహాన్నిచ్చారు.  కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొని శ్రీ వేదభారతి ట్రస్ట్ నెలకొల్పి విరాళాలు సేకరించి 2000 నాటికి ఋగ్వేదాన్ని సీడీలలో అప్పటి ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

వేదాలే కాకుండా శాస్త్రాలు, సంస్కృతాంధ్రములలో నిష్ణాతులైన శ్రీ అవధానులు గారు మెల్బోర్న్ నగరం విచ్చేసి వారి ప్రసంగాలనుముఖస్థంగా వినే అవకాశం కలగడం మనం చేసుకున్న అదృష్టం. ప్రసంగ వేదిక వివరాలు:

Avadhanulu

Send a Comment

Your email address will not be published.