వైద్య పరిశోధనా రంగంలో తెలుగు వెలుగు

WhatsApp Image 2020-03-15 at 13.29.52

Gullapalli awards 2019

కాలగమనంలో బ్రతుకు జీవితంలో నేర్పిన పాఠాలు, బ్రతుకు బాటలో గమ్యం కోసం వెతుకులాటలు, గమ్యమే అగోచరమై విదేశీ సీమలో వెలుగు బాటలు, సాటి మానవ మూర్తుల జీవితాలకు వెలుగు నింపాలన్న కోరికలు, విదేశీ గడ్డపై తెలుగు బావుటాను ఎగురవేయాలన్న ఆశలు.

తండ్రి వరంగల్ లోని అజంతా మిల్లులో కార్మికునిగా పని చేస్తూ లేడీస్ టైలర్ గా అర్ధరాత్రి వరకూ పని చేసి ఐదుగురు సంతానాన్ని పోషించడానికి చేతికి నోటికి మధ్య యజ్ఞ గుండంలో అగ్నికి ఆహుతై వెలుగు దీపాలను అందించిన కధనమిది. జీవన ప్రయాణంలో మానవ విలువలకు తిలోదకాలివ్వకుండా తన ప్రమాణాలకు పట్టం గట్టి రహదారి బాటను రాచబాటగా తీర్చి దిద్దుకున్న వైనమిది. మరెంతోమంది యువరత్నాలకు స్పూర్తినిచ్చే నందన వనమిది.

డిగ్రీ చదువుతున్న సమయంలోనే తల్లితండ్రులను పోగుట్టుకొని జీవన పోరాటం సాగించి – మొదట పార్క్ డేవీస్ లో మెడికల్ రిప్రేసేంటేటివ్ గా ఉద్యోగం మొదలిడి తరువాత జాన్సన్ & జాన్సన్ సంస్థలో రెండు రాష్ట్రాలకు (ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్ణాటక) అధిపతిగా ప్రయాణం సాగించారు డా. శ్రీనివాస్ గుల్లపల్లి. ఉద్యోగం చేస్తూనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MBA, గీతం విశ్వవిద్యాలయంలో అప్లైడ్ కెమిస్ట్రీలోను పట్టబద్రులవడం జరిగింది.

WhatsApp Image 2020-03-15 at 13.29.55

జాన్సన్ & జాన్సన్ సంస్థలో పని చేస్తున్నపుడు అమెరికాలోని బోస్టన్ మెడికల్ స్కూల్ వారు Screening and Early Evaluation of Kidney Disease, Chronic Kidney disease కి ఒక పట్టిక తాయారు చేయాలన్న తలంపుతో భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలను కేంద్రాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా CKD వ్యాధికి సంబందించిన కీలకమైన వివరాలు సమీకరించడంలో డా.శ్రీనివాస్ కృతకృత్యులవ్వడంతో పరిశోధనా రంగంలో అవకాశాలకు పేరున్న అమెరికాలో మంచి అవకాశం రావడం అలా ప్రాశ్చాత్య దేశానికీ వెళ్ళడం జరిగింది. మిచిగన్ విశ్వవిద్యాలయంలో మైక్రో బయోలజీలో పట్టభద్రులై మూడో మాస్టర్స్ డిగ్రీని స్వంతం చేసుకున్నారు. అమెరికా ప్రభుత్వ సంస్థ “ఫుడ్ & డ్రగ్స్” లో పని చేసిన పిదప 2009లో కంప్యూటర్ రంగంలో నెట్ వర్కింగ్ ఇంజనీర్ చదవటానికని ఒక విద్యార్ధిగా ఆస్ట్రేలియా రావడం జరిగింది.

క్రొత్త చోటుకి రావడంతో ఎన్ని డిగ్రీలున్నా అందరిలాగే పెట్రోల్ బంక్ లలో, పిజ్జా డెలివరీ బాయ్ తో మొదలుపెట్టి సేల్స్ కంపెనీల్లో చాలీచాలని డబ్బులతో కాలం గడుపుతూ కుటుంబాన్ని కొంత కాలం భారత దేశం పంపించి సామాన్యంగా వలస వచ్చిన వారు పడే ఈతి బాధలు షుమారు 3 సంవత్సరాలు పడి మళ్ళీ జీవితంలో నిలదొక్కుకున్నారు శ్రీనివాస్ గారు. తాను చదువుతున్నది ఎందుకూ కొరగానిదని తెలిసి కూడా కష్ట నష్టాలకోర్చి కంప్యూటర్ డిగ్రీ పూర్తి చేసారు. అయినా మనసంతా మొదట పనిచేసిన వైద్య రంగంపైనే.

అదృష్టం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని నానుడి ప్రకారం కాలం కలిసొచ్చి నీకో కార్ప్ సంస్థలో మంచి అవకాశం దొరకడం, అప్పటి నుండి తిరిగి చూడకుండా ఆధునిక వైద్య పరికరాలు తయారీ పరిశోధనలో అంచెలంచెలుగా ఎదుగుతూ చదువులో డాక్టరేట్ సంపాదించి తన మార్కు గల కొన్ని పరికరాలు తయారుచేయడంలో దృష్టి సారించారు.

ఈ ప్రక్రియలో బ్రెయిన్ ట్యూమర్ ని సులువుగా తీయటంలో ఒక పరికరాన్ని, Pierre Robin Syndrome కి సంబంధించి కంప్యూటర్ చిప్ తో బోన్ డిస్ట్రాక్టర్ పరికరాన్ని మరియు Bionic eye కి సంబంధించి మరో పరికరాన్ని తన పరిశోధనల ద్వారా కనిపెట్టడం జరిగింది.

S Gullapalli awards 2019

ఆలా కొంత వైద్య పరిశోధన రంగం లో కొంత అనుభవం సంపాదించిన తరువాత ప్రపంచములోనే రెండవ అతి పెద్దది అయిన జిమ్మర్ బయోమేట్ లో వైద్య శాస్త్రవేత్తగా చేరడం జరిగింది. ఇందులో భాగంగా గుండె ఆపరేషన్ లకి Minimal Invasive టెక్నిక్స్ కి శ్రీనివాస్ తో కూడిన ముగ్గురి శాస్త్రవేత్తలకు ” ది వరల్డ్ సొసైటీ అఫ్ కార్డియోవాస్క్యూలర్ అండ్ థొరాసిక్ సర్జన్స్” మరియు ది యూరోపియాన్ అసోసియేషన్ ఫర్ కార్డియో థొరాసిక్ సర్జరీ తరుపున “ఇన్వెన్షన్ అఫ్ ది ఇయర్ 2017 ” ప్రదానం చేసారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తముగా సుమారు 85 వేల ఉద్యోగులు ఉన్నఈ కంపెనీ లో “గ్లోబల్ ఎంప్లాయ్ అఫ్ ది ఇయర్ తో పాటు ఆసియా పసిఫిక్ లీడర్షిప్ అవార్డు వరుసగా మూడు సార్లు 2017, 2018 మరియు 2019 కి గెలుచుకోవడం ఒక అరుదయిన విషయం.
ఇంతటి ఘనత సాధించినందుకు గాను తన కంపెనీలో “అసోసియేట్ డైరెక్టర్ అఫ్ రీసెర్చ్ ఆసియా పసిఫిక్” నియమిచబడినాడు. ఫార్చ్యూన్ 100 వైద్య పరికరములు పరిశ్రమలలో ఒక భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఈ ష్టానానికి చేరుకోవడం మొట్టమొదటి సారి జరిగింది.

స్వతహాగా తెలుగు భాషాభిమాని. మేల్బౌర్న్ నగరంలో 2018 నవంబరు నెలలో జరిగిన వంగూరి ఫౌండేషన్ వారి 6వ ప్రపంచ సాహితీ సదస్సు నిర్వహించడంలో కీలక పాత్ర వహించారు. ఆక్లాండ్ నగరంలో 2019, నవంబరు నెలలో జరిగిన ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ తెలుగు వారి మొదటి సాహితీ సదస్సులో వక్తగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియా తెలుగు సంఘం కార్యదర్శిగా రెండేళ్ళు పనిచేసి అంకిత భావంతో సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వహించారు.

సతీమణి కవిత మరియు ఏకైక పుత్రిక తన్వి తో మెల్బోర్నే నగరంలో ప్రస్తుత నివాసం.  ఈ స్త్రీ ద్వయం ఎల్ల వేళలా తనకు అండగా ఉండి తన జీవన ప్రయాణంలో భాగమవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని అంటున్నారు శ్రీ గుళ్ళపల్లి  గారు.  వారిరువురికి కృతజ్ఞతాభినందనలు తెలుపుకుంటున్నారు.
IMG-20200317-WA0006
IMG-20200317-WA0007
WhatsApp Image 2020-03-12 at 10.32.17 (1)

Send a Comment

Your email address will not be published.