శ్యామ్‌ సింగరాయ్ గా నాని

shyam singha royనాని హీరోగా రూపొందనున్న కొత్త చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహించనున్నారు. ‘శ్యామ్‌ సింగ రాయ్’ అనే పేరును నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని, వీడియోను తమ అధికారిక సామాజిక మాధ్యమం అయిన యు ట్యూబ్‌ ద్వారా విడుదల చేశారు. ఇందులో నాని కళ్లను మాత్రమే చూపించారు. 2020 డిసెంబర్‌ 25న చిత్రం విడుదల తేదీగా ప్రకటించారు. నానికి ఇది 27వ చిత్రం. చిత్రం ప్రారంభం, ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ పి.డి.వి.ప్రసాద్‌.
నాని, సుధీర్‌బాబు, నివేద తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘వి’. వంశీ నిర్మాత, రాహుల్‌ సాంకృతియాన్‌ దర్శకుడు. సోమవారం నాని పుట్టినరోజును పురస్కరించుకుని ‘వి’ చిత్రంలో కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఇంతకుముందు నానితో పాటు, సుధీర్‌బాబు లుక్స్‌ను కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్‌ వాటికి వస్తున్న స్పందనతో సంతృప్తి వ్యక్తం చేసింది.

Send a Comment

Your email address will not be published.