భారతీయ ఓటరుకు అభ్యర్థిని తిరస్కరించే హక్కును కూడా ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. ఓటు వేయడానికి ఇచ్చే పత్రంలోనే మరో బటన్ ను కూడా ఏర్పాటు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో, భారతీయ ఓటరుకు ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సిన అగత్యం తప్పింది. ఎవరో ఒకరిని ఎన్నుకోవాల్సిన అవసరం లేకుండా అభ్యర్థిని తిరస్కరించడానికి ఓటరుకు అవకాశం అంది వచ్చింది. తిరస్కార ఓట్ల సంఖ్యా 50 శాతానికి మించితే ఆ niyojaka వర్గంలో మళ్ళీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థుల్ని తిరస్కరించే హక్కు కూడా ఓటరులకు రాజ్యాంగం ద్వారా లభించిన హక్కేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఓ అభ్యర్థిని తిరస్కరించడానికి కూడా ఓటరులు క్యూలలో నిలబడాలా? పోలింగుకు దూరంగా ఉంటె సరిపోదా? వోటరులు తమ అసంతృప్తిని ఏదో విధంగా అభ్యర్థులకు తెలియజేయడమే మంచిదని, తిరస్కార ఓటుతో తెలియజేయడం సబబుగా ఉంటుందని కోర్టు వివరించింది. అసలే చిన్న చిన్న పార్టీలతో సంకీర్ణాలు ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తిరస్కార ఓటు వల్ల ఓట్లు మరింతగా చీలిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎటూ తేల్చుకోలేని ఓటరు సాధారణంగా తిరస్కార ఓటు వైపు మొగ్గే అవకాశం ఉందని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఎన్నికలు మరింత బలహీనపడడానికి కూడా ఈ తిరస్కార ఓటు దోహదం చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం కోర్టు మాత్రం ఎన్నికల్లో సరైన అభ్యర్థులు పోటీ చేయడానికి, ఎన్నికల పరమార్థాన్ని కాపాడడానికి ఇటువంటి ఓటు సహాయపడుతుందని పేర్కొంది. 50 శాతానికి మించి తిరస్కార ఓటు పడినప్పుడు ఆ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరగడం వల్ల, ఉప ఎన్నికల సమాఖ్య పెరిగిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటర్లు తమను తిరస్కరించే ప్రమాదం ఉందని అభ్యర్థులు భయపడాల్సిన అవసరం ఉందని కొందరు వాదిస్తున్నారు.
సరికొత్త ఓటు హక్కు
