సినీ వినీలాకాశంలో నిత్య సుహాసిని

suhasini1

సినిమా పరిశ్రమలో తమదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయగలిగిన నటీమణులు అతికొద్దిమందే. వారిలో అగ్రశ్రేణిలో నిలిచిన కథానాయిక, నటీమణి సుహాసినీ మణిరత్నం. చాలా మంది తారలకు వాళ్ళ అసలుపేర్లు ఒకటైతే తెరమీద పేరు మరొకటి ఉంటుంది. కానీ సుహాసిని ఇందుకు విభిన్నం. ఆమె అసలు పేరు ‘సుహాసిని” అదే పేరుతో కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళం. కన్నడం తదితర భాషల్లో నటించి దక్షిణ భారత దేశంలో అగ్రశ్రేణి కథానాయికగా నిలిచారు. సినీ దర్శకురాలిగా, కథకురాలిగా వివిధరకాల బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఆమె 1971 ఆగస్టు 15న (వయస్సు: 47 సంవత్సరాలు) చెన్నైలో జన్మించారు. నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది. ఈమె తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించించారు. సుహాసిని ప్రసిద్ధ భారతీయ నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ కూతురు. 1988లో ఈమె ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుకున్నారు. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు.

Sindhu Bhairavi

1996లో, దర్శకత్వములో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన ఇందిర సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చారు.. ఈమె, ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు. మద్రాస్ టాకీస్ లో మణిరత్నం సోదరుడు కీ.శే. జి.శ్రీనివాసన్ కూడా ఉండేవారు. సుహాసిని 1985లో కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమనటి) అవార్డు అందుకున్నారు. ఈమె తమిళ, తెలుగు. కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించించారు. 1999లో ఎ.ఎఫ్.ఐ చిత్రోత్సవముకు ఎన్నికైన వానప్రస్థమ్ సినిమాలో సుహాసిని తన నటనకుగాను ప్రశంసలందుకున్నారు.

సుహాసిని నటిగా మెప్పించిన సినిమాలు (తెలుగులో)
maxresdefault2సంగమం, శ్రీ మహాలక్ష్మి (2007), రాఖీ (2006), అమ్మ చెప్పింది (2006), షాక్ (2004), దొంగరాముడు అండ్ పార్టీ (2003), గెలుపు (2002), నువ్వు నాకు నచ్చావ్ (2001), సకుటుంబ సపరివార సమేతం (2000), రాజకుమారుడు (1999), ఊయల (1998), పెళ్లి పందిరి (1997), ఎగిరే పావురమా (1997), హలో గురూ (1996), శుభలగ్నం (1994), అక్క మొగుడు (1991), మరణ మృదంగం (1988), మంచి దొంగ (1988), ఆఖరి పోరాటం (1988), పున్నమి చంద్రుడు (1987), పుణ్యదంపతులు (1987), బావామరదళ్లు (1987), వారసుడొచ్చాడు (1987), ఆరాధన (1987), సంసారం ఒక చదరంగం (1987), తేనె మనసులు (1987), శ్రావణ సంధ్య (1986), రాక్షషుడు (1986), చంటబ్బాయ్ (1986), కిరాతకుడు (1986), మిస్టర్ భరత్ (1986), ముద్దుల మనవరాలు (1986), సిరివెన్నెల (1986), స్రవంతి (1986), అర్జున్ 3D (1985), మహారాజు (1985), బుల్లెట్ (1985), జాకీ (1985), స్వాతి (1985), ఇంటిగుట్టు (1984), సర్దార్ (1984), ఛాలెంజ్ (1984), జస్టిస్ చక్రవర్తి (1984), మంగమ్మ గారి మనవడు (1984), ముక్కు పుడక (1984), మనిషికో చరిత్ర (1984), మగ మహారాజు (1983), మంచుపల్లకి (1982), కొత్త జీవితాలు (1981)

ఇతర భాషలలో
స్టంబుల్ (2003), నమ్మల్ (2002), తీర్‌తడనమ్ (2001), వానప్రస్థమ్ (1999), భారతీయం (1997), అమృతవర్షిణి (1997), చిన్న కన్నమ్మ (1993), సమూహం (1993), ముత్తిన హర (1990), ఎన్ పురుషన్ దాన్ ఎనక్కుమ్ మాట్టుం దాన్ (1989), ఒరు సయహ్నతింటే స్వప్నం (1989), ధర్మాతిన్ తలైవన్ (1988), ఎన్ బొమ్ముకుట్టి అమ్మవుక్కు (1988), మణివాతరిల్లే ఆయిరం శివరాత్రిక (1987), దూరత్తు పచ్చయ్ (1987), మనత్తిల్ ఉరుత్తి వేండుం (1987) రక్కుయిలిన్ రాజస్సదసిల్ (1986), ప్రణామం (1986), బంధన (1985), కథ ఇథు వరే (1985), సింధుభైరవి (1985), ఆరోరు మర్యాతే (1984), ఎంతె ఉపాసన (1984), తాతమ్మే పూచ పూచ (1984), అదమింతె వరియెల్లు (1983), కూడెవిడె? (1983), ఒరు ఇందియ కనవు (1983), ఆగయ గంగై (1982), గోపురంగళ్ సాయవత్తిల్లై (1982), పలైవాన సొలై (1981), నెంజతై కిల్లతే

దర్శకురాలిగా ఇందిర (1996)
కథకురాలుగా…. గురుకాంత్ (2007), ఇద్దరు (1997), ఇందిర (1996), దొంగ దొంగMani_Ratnams
నిర్మాతగా -ఇద్దరు (1997)

పురస్కారాలు
తెలుగు సినిమా ప్రత్యేక పురస్కారాలు
రఘుపతి వెంకయ్య అవార్డు (బంగారు నంది) ఎన్.టి.రామారావు జాతీయ అవార్డు బి.ఎన్.రెడ్డి జాతీయ అవార్డు నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు. ఉత్తమ చిత్రం ఉత్తమ బాలల చిత్రం ఉత్తమ విజయవంతమైన చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం ఉత్తమ జాతీయసమైక్యతా చిత్రం రఘుపతి వెంకయ్య అవార్డులలో బంగారు నందులు పొందారు
ఉత్తమ దర్శకులు ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం ఉత్తమ సందేశాత్మక చిత్రం ఉత్తమ ఇంటిళ్లిపాది చూడగలిగే చిత్రం ఉత్తమ దర్శకులు ఉత్తమ నటీమణి కేటగిరీల్లో రజత నందులు పొందారు

Send a Comment

Your email address will not be published.