మనిషి జీవితం
మేఘంలాంటిది
మేఘంలో మెరుపు కొంచమే
నీరే అధికం
మనిషి జీవితంలోను
నవ్వులు కొంచం
కన్నీరే అధికం
పువ్వులపై మంచుబిందువులు ఉన్నట్లు
నవ్వులోను కన్నీరు ఉంది
నిజంచెప్పాలంటే నవ్వు అనేది
కన్నీటి నూనెలో మండే వెలుగే
దేవుడిపై నమ్మకం ఉన్న వ్యక్తి
దేవుడికి భయపడి బతుకుతాడు
దేవుడికి భయపడిన వ్యక్తి
నేరం చెయ్యడు
పాపం చెయ్యడు
మంచోళ్ళు ఎక్కువగా
పేదరికంలో మగ్గుతాడు
నిజాయితీగా ఉన్నవారినే
కష్టాలు వేధిస్తాయి
అదే జీవిత నైజం
——————————–
యామిజాల జగదీశ్
