'83' కపిల్‌ దేవ్‌ సినిమా

’83’ పేరుతో వెండితెరపై కపిల్‌ దేవ్‌ సినిమా

Kapil-83భారతదేశ క్రికెట్‌ చరిత్రలో 1983 ఏడాదిని మరచిపోలేం. కపిల్‌దేవ్‌ నాయకత్వంలో తిరుగులేని వెస్టీండిస్‌ టీమ్‌పై విజయాన్ని సాధించిన క్రికెట్‌ విశ్వవిజేతగా భారతదేశం ఆవిర్భవించిన సంవత్సరమది. తొలిసారి ప్రపంచ క్రికెట్‌ కప్పును భారతావని ముద్దాడిన ఏడాది 1983. ఈ అసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై ’83’ సినిమాగా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్‌ కబీర్‌ ఖాన్‌. రణ్‌ వీర్‌ సింగ్‌ కపిల్‌దేవ్‌ పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకొనే కపిల్‌ భార్యగా ఇందులో కనిపించనుంది. ఈ చిత్రంలో కపిల్‌ డేర్‌ డెవిల్స్‌ సాధించిన విజయాలను అద్భుతంగా చిత్రీకరించారు. ముంబైలో రీసెంట్‌గా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో తాహిర్‌ రాజ్‌ బాసిన్‌(సునీల్‌ గవాస్కర్‌), హార్డీ సంధు(మదన్‌లాల్‌), షకీబ్‌ సలీమ్‌(మహీందర్‌ అమర్‌నాథ్‌) నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రణవీర్‌ సింగ్‌ కపిల్‌దేవ్‌లా మేకోవర్‌ అయ్యారు. తన శరీరాకృతిని ఓ క్రీడాకారుడిగా మార్చుకోవడానికి ఆయన పడ్డ కష్టం మనకు తెరపై కనపడుతుంది. ఫ్యాన్స్‌ కోసం కపిల్‌దేవ్‌లా ఉన్న రణవీర్‌లుక్‌ను చిత్రీ యూనిట్‌ విడుదల చేసింది. అది కూడా ఆయన ట్రేడ్‌ మార్క్‌ క్రికెట్‌ షాట్‌ నటరాజ్‌ స్టిల్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. 1983 వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో టన్‌బ్రిడ్జ్‌లో జింబాబ్వేతో ఆడిన మ్యాచ్‌లో కపిల్‌ దేవ్‌ 175 పరుగులను సాధించారు. క్రికెట్‌ చరిత్రలో ఈ మ్యాచ్‌ మరపురాని మ్యాచ్‌గా నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ఈ మ్యాచ్‌ లైవ్‌లో ప్రసారం కాలేదు. రికార్డు కూడా కాలేదు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణ. దీపికా పదుకొనే, సాజిద్‌ నడియద్‌వాలా, కబీర్‌ ఖాన్‌, నిఖిల్‌ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్‌ లిమిటెడ్‌, ఫాంటమ్‌ ఫిలింస్‌ ఈ బిగ్గెస్ట్‌ స్పోర్ట్స్‌ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల చేస్తున్నారు

Send a Comment

Your email address will not be published.