ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

కవిత్వం జీవితమంత విస్తృతం
జీవితం కవిత్వమంత సుందరం

తెలుగు సాహితీపరులకంతా ‘ఎస్వీ’గా ప్రసిద్ధులైన ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అధ్యాపకులుగా మొదలిడి ఆచార్యుడై అంచెలంచెలుగా ఎదిగి నిరంతరం సాహిత్యమే ఊపిరిగా ఎన్నో పదవీ బాధ్యతలను చేపట్టి ప్రస్తుతం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబించాలని సమాజాన్ని ప్రగతిమార్గంలో నడిపించాలని ఎస్వీ ఆకాంక్ష. అందుకోసం ‘మంచి’కి తోడ్పడే సాహిత్యాన్నంతా ‘ఎస్వీ’ ఆలింగనం చేసుకుంటారు. అభ్యుదయ సాహిత్యానికి నిరంతర వ్యాఖ్యాతగా పల్లెసీమాలకు చేర్చినవారు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ. వయసుతో పనిలేకుండా స్నేహమే ఆయుధంగా ఏ భేషజమూ లేకుండా ఉన్నతమైన ఔన్నత్యానికి అయన ఒక చిరునామా. ఎన్నో గ్రంధాలు ప్రచురించారు. మరిన్ని గ్రంధాలకు సంపాదకత్వం వహించారు. అంతకుమించి మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. 2017 సంవత్సరంలో జరిగిన ప్రపంచ మహాసభలకు మూలస్థంభంలా నిలిచి సాహితీ సమరాంగణంలో దివ్వెగా వెలిగారు.

Send a Comment

Your email address will not be published.