వేణుగోపాల్ రాజుపాలెం తెనాలిలో జన్మించి, కూచిపూడిలో ప్రాథమిక విద్య సాగించి, తదుపరి మైసూరు విశ్వవిద్యాలయమునందు పట్టభద్రులై, ఐ.ఐ.టి Kanpur లో M. Tech, ఐ.ఐ.టి ముంబై లో డాక్టరేట్ అయి, జపాన్లో కొంత కాలం పనిచేసి, గత 15 వత్సరములుగా మెల్బోర్న్ నగరమందు, భార్య అనూరాధ, కుమారులు శ్రావణ్, తరుణ్ లతో నివసిస్తున్నారు. తెలుగు మాట, తెలుగు పాట అంటే అత్యంత అభిమానమున్న వ్యక్తి. తెలుగు వాళ్ళతో తెలుగులోనే మాట్లాడటం గర్వించదగ్గ విషయం అని నమ్మే వ్యక్తి. అనేక భారత దేశ సాంస్కృతిక కార్యకలాపాలలో ఉత్సాహంతో పాల్గొంటూ, అందరినీ ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టిన వ్యక్తి. తెలుగులో కవితలు వ్రాయటం, తెలుగు పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం.