శ్రీ మల్లికేశ్వర రావు కొంచాడ మెల్బోర్న్ లో గత 9 సంవత్సరాలుగా వుంటున్నారు. ఉద్యోగ రీత్యా కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వీరికి తెలుగులో కవితలు వ్రాయడం తెలుగు సాహిత్యం చదవటం అలవాటు. వీరు తన భార్య శ్రీమతి ప్రత్యూష మరియు వారి అబ్బాయి హరి తో కలిసి మెల్బోర్న్ లోని తెలుగు వారి కోసం ద్వై మాసిక పత్రిక “స్రవంతి” ని ప్రచురిస్తూ వుంటారు. తెలుగు వారందరికీ తెలుగు భాషే ఒక అనుబంధ బాంధవ్యాన్ని కలిగిస్తుందని గట్టిగా నమ్మి ఆ భాషకు చేతనైనంత సేవ చేయాలన్న ఔత్సాహికుడు.
మల్లికేశ్వర రావు కొంచాడ
