ఉప్పులో ఉన్న వాడిని వేడిగా, పదునుగా వాడి మంచి పదాలతో ముత్యాల్లాంటి మనసుకు హత్తుకునే కవితలు వ్రాయగల యువ కిశోరం సాయిరాం ఉప్పు. మెల్బోర్న్ నగరంలో నివసిస్తూ గత పదేళ్లుగా ఎన్నో సంఘసేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఆస్ట్రేలియా తెలంగాణా సంఘంలో చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తుంటారు. టేలస్ట్రా కంపనీలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గా పనిచేస్తుంటారు. తెలుగు భాషను భావి తరాల వారికి అందివ్వాలన్న తపన వారి ప్రతీ మాటలో ప్రతిధ్వనిస్తుంది.
సాయిరాం ఉప్పు
