కామేశ్వరి సాంబమూర్తి.భమిడిపాటి

బండ రాయి, బండ రాయి అంటూ జీవం లేని ఒక ప్రకృతి స్వరూపాన్ని సజీవ రూప కల్పన చేసిన “బండరాయి” కవిత సామజిక స్పృహని ప్రకృతి సమతుల్యానికి ప్రతీ వస్తువు తోడ్పడతాయన్న భావాన్ని కలుగ జేస్తుంది. ఈ “బండరాయి” కవితలోని పద కూర్పు, భావ ప్రకటన నన్ను చలింప జేసాయి. ఈ కవిత చదివిన తరువాత ఉలితో శిలను చెక్కే శిల్పికి సుత్తితో రాయిని బ్రద్దలుకొట్టే పామరుడికి ఉన్న వ్యత్యాసం ఏమిటో అర్ధం అయింది. ఎన్ని తార తమ్యాలున్న సృష్టిలో ప్రతి వస్తువుకీ ఒక గురుతర బాధ్యత ఉంటుందని ఎవరి వారి అవకాశాన్ని బట్టి వారి విధులను నిర్వర్తిస్తూ ఉంటారన్న ఒక గొప్ప భావన కలుగక మానదు.

శ్రీమతి భమిడిపాటి కామేశ్వరి గారి రచనల్లో మానవతా మమత, బంధాలు అనుబంధాలు, ప్రేమ ప్రకృతి, సంస్కృతీ సాంప్రదాయాలు ఇలా ఎన్నెన్నో హృదయాన్ని రంజింపజేసే పద కవితలు ఒక నదీ ప్రవాహంల కొన సాగుతూ ఉంటాయి. తల్లికి బిడ్డకి, సూర్యుడుకీ కాంతికి, కలానికి కాగితానికి ఉన్న అనుబంధం నిర్వచనానికి అతీతం. అలాగే శ్రీమతి భమిడిపాటి కామేశ్వరి గారి కలం నుండి జాలువారిన రచనలకు సమీక్ష వ్రాయడం ఎవరికైనా కత్తి మీద సాము.

1 Comment

Send a Comment

Your email address will not be published.