ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ప్రపంచ తెలుగు రచయితల సంఘం

తెలుగు నేలపైన మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ లక్ష్యంగా, కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో 2019 డిసెంబర్ 27, 28, 29 తేదీలలో విజయవాడ పి.బి. సిద్ధార్థ కళాశాలలో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్న సంగతి మీకు తెలిసినదే!
2019వ సంవత్సరాన్ని యునెస్కో అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా ప్రకటించిన నేపథ్యంలో మాతృభాషల పరిరక్షణ వైపు దృష్టి సారించవలసిందిగా అటు తెలుగు ప్రభుత్వాలు ఇటు తెలుగు ప్రజల గుండె తలుపులు తట్టటం ఈ మహాసభల లక్ష్యం.

మహాసభలలో చర్చనీయాంశాలు
• తెలుగువారి భాషా సంస్కృతులు, చరిత్ర, మరియు సాంకేతిక ప్రగతి గురించి,
• తెలుగు నేలపైన కొన ఊపిరిలో ఉన్న వివిధ మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణల గురించి,
• సాహిత్యం సమకాలీన సమాజంపై ప్రసరింప చేయగల ప్రభావాల గురించి,
• అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, మలేషియా తదితర దేశాలలోనూ, తమిళనాడు, ఒడిసా, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలోనూ జీవిస్తున్న తెలుగువారి జీవనం, తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల, గురించి…
• యేళ్ల తరబడీ నిరాదరణకు గురౌతున్న గ్రంథాలయ వ్యస్థను పటిష్ఠ పరచటం గురించి,
• ఇంకా ఇతర సాహిత్య, సామాజిక అంశాల గురించి చర్చలు జరుగుతాయి. భాష మరియు సాహిత్యాల పై లోతైన అధ్యయనం జరిగేందుకు వీలుగా మరిన్ని చర్చనీయాంశాలు సూచించ వలసిందిగా వివిధ రంగాల ప్రముఖులను కోరుతున్నాం.

ఈ బృహత్తర కార్యభారాన్ని తలకెత్తుకున్న ప్రపంచ తెలుగు రచయితల సంఘంలో జీవిత సభ్యత్వం స్వీకరించవలసిందిగా భాషాభిమానులందరినీ కోరుతున్నాం. ఇప్పటికే సభ్యులైన మిత్రులు బాధ్యత తీసుకుని తమ సాహితీ మిత్రులను కూడా జీవిత సభ్యులుగా చేర్పించ ప్రార్థన.

ప్రపంచ తెలుగు రచయితల సంఘం జీవిత సభ్యత్వం:
రచయితలు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యాభిమానులైన ప్రతీ ఒక్కరూ ప్రపంచ తెలుగు రచయితల సంఘంలో జీవితసభ్యులుగా చేరవచ్చు.
జీవిత సభ్యత్వం నిమిత్తం రు.2000/-(విదేశాల్లో తెలుగు వారికి US 50$)చెల్లించవలసి ఉంటుంది.
సభలలోపు జీవిత సభ్యులుగా చేరినవారు, అదనంగా ప్రతినిథి రుసుము చెల్లించనవసరం లేదు.
జీవిత సభ్యులు కలకాలం పదిలపరచుకునేలా ధృవీకరణపత్రాన్ని మహాసభలలో అందిస్తాము.

ప్రతినిధులుగా నమోదు
మహాసభలకు ప్రతినిధులుగా నమోదు కాగోరువారు రు.500/- చెల్లించవలసి ఉంటుంది.
మహాసభలలో పాల్గొన్న ధృవీకరణ పత్రాన్ని ప్రతినిధులందరికీ మహాసభలలో అందజేస్తాము.
జీవిత సభ్యత్వం లేదా ప్రతినిధి రుసుము లను 2019 నవంబరు 30 లోగా PRAPANCHA TELUGU
RACHAYITALA SANGHAM పేర, విజయవాడలో చెల్లించే విధంగా డి.డి. లేదా చెక్కు పంపండి.

చిరునామా:
కార్యదర్శి,
ప్రపంచ తెలుగు రచయితల సంఘం,
1వ అంతస్థు, సత్నాం టవర్స్,
బకింగ్‘హాం పేట పోష్టాఫీసు ఎదురుగా,
గవర్నర్ పేట, విజయవాడ-520002.

జీవిత సభ్యులు మరియు ప్రతినిధులకు మాత్రమే ఈ మహాసభల ప్రాంగణంలో భోజన, ఉపాహార సౌకర్యాలుంటాయి. వసతి ఏర్పాట్లు మాత్రం ఎవరికి వారే చేసుకోవలసి ఉంటుంది.

ముఖ్య సూచనలు
జీవిత సభ్యులు లేదా ప్రతినిధులుగా నమోదయిన వారికి మాత్రమే ప్రత్యేక సంచిక, కవిసమ్మేళనాలు, ప్రసంగాలు, పత్ర సమర్పణలలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ప్రత్యేక సంచిక (సావనీరు)లో ప్రచురణార్థం రచనలను పంపటానికి ఆఖరు తేదీ 2019 అక్టోబరు31. ప్రచురణ తుది నిర్ణయం సంపాదకులదే!
సభా వేదికపైన వీలుని బట్టి రచయితలు తమ నూతన గ్రంథాలను ఆవిష్కరించుకునే అవకాశం కల్పిస్తున్నాం.
అక్టోబరు 31 తరువాత ప్రతినిధుల నమోదు నిలుపు చేయటం జరుగుతుంది. గడువు దాకా ఆగకుండా వెంటనే పేర్ల నమోదు చేసుకోవలసిందిగా విఙ్ఞప్తి.
మహాసభలలో స్పాట్ రిజిష్ట్రేషన్ ఉండదు. అప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తామంటూ నిర్వాహకుల మీద వత్తిడి తీసుకు రావద్దని మనవి.
రచయితలు, భాషాభిమానులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహాసభలు విజయవంతం కావటానికి సహకరించండి. ఎవరో వచ్చి ఆహ్వానించా లనుకోకుండా, మాతృభాషాభిమానంతో స్వచ్ఛందంగా స్పందించాలని ప్రార్థిస్తున్నాం

మరిన్ని వివరాలకు
శ్రీ గుత్తికొండ సుబ్బారావు,అధ్యక్షుడు 9440167697,
డా. జి వి పూర్ణచందు, కార్యదర్శి 9440172642.

1 Comment

Send a Comment

Your email address will not be published.