అందాలరాశి

అందానికి కాంచనమాల అని ఆరోజుల్లో అందరూ అనుకునే వాళ్ళు. హీరోయిన్ కి గ్లామర్ తీసుకొచ్చిన తొలి తార కాంచనమాల. ఆమె తన పదిహేడవ ఏట కలకత్తాలో పుల్లయ్యగారి శ్రీకృష్ణ తులాభారంలో చెలికత్తె వేషం వేశారు. అది 1935వ సంవత్సరం. ఆ తర్వాత విప్రనారాయణ, మాలపిల్ల, గృహలక్ష్మి, వందేమాతరం, మళ్ళీ పెళ్లి, బాలనాగమ్మ, తదితర సినిమాల్లో కాంచనమాల హీరోయిన్ పాత్రలు వేశారు. అప్పట్లో కాంచనమాల ఫోటోలతో క్యాలండర్లు ముద్రించేవారు. ఫిలిం లాండ్ డ్రీం గరల్ గా ఆమెను కొనియాడేవారు. అసలు సినేరంగంలో స్టార్ క్రేజ్ అనేది కాంచనమాలతోనే ఆరంభమైంది. అయితే ఆమె కెరీర్ అనుకోని రీతిలో ముగిసింది. ఒక నిర్మాత ఆమె బెదిరింపును చాటుమాటుగా రికార్డు చేసి హెచ్చరించడంతో ఆమె వెండితెర భవిష్యత్తుకు తెర పడటం విచారకరం. దురదృష్టవశాత్తు ఆమె మతిస్థిమితం పోగొట్టుకుని అనారోగ్యంపాలై కన్నుమూశారు.

Send a Comment

Your email address will not be published.