అక్కినేని అఖిల్ వస్తున్నాడు

అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య హీరో గా ప్రవేశించి చాలా కాలం అయినా అక్కినేని అభిమానుల ఎదురుచూపులు మాత్రం ఆగ లేదు. ఇంకా ఎవరో వస్తారు, అది ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తూనే ఉన్నారు. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి ‘మనం’ సినిమాలో నటిస్తున్నా ఏదో వెలితిగానే ఫీల్ అయ్యారు. వారందరి ఎదురు చూపులూ అక్కినేని అఖిల్ కోసమే. అభిమానుల ఎదురు చూపులు ఫలించాయి. త్వరలో అఖిల్ హీరోగా సినిమా నిర్మాణం ప్రారంభమవుతుందని, మంచి కధ, దర్శకుడు కోసం చూస్తున్నామని నాగార్జున ప్రకటించారు. అఖిల్ కూడా వీటి పై స్పందించాడు. అయితే అంతకంటే ముందు అఖిల్ ఒక సినిమాలో గెస్ట్ గా నటిస్తాడని ఫిలిం నగర్ లో టాక్. అది ‘మనం’ సినిమా నేనట. ఆ సినిమా లో ముందుగా అఖిల్ పాత్ర అనుకోక పోయినా అభిమానుల కోసం ప్రత్యేకంగా అతిధి పాత్రని సృష్టించారట. మరి ఈ వార్త కనుక నిజమైతే అభిమానులకి పండగే.

Send a Comment

Your email address will not be published.