అఖిల్ చిత్రం అక్టోబర్ లో

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న అఖిల్ చిత్రం ఒతోబెర్ 22 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఈ చిత్రం నిర్మాత నితిన్ మాట్లాడుతూ అఖిల్ చిత్రం షూటింగ్ త్వరలోనే పూర్తి అయి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ చకచకా పూర్తి చేసుకుని వచ్చే నెలలో అనుకున్న తేదీకి విడుదల అవుతుందని తెలిపారు.

ప్రస్తుతం ఈ చిత్రం పాటల చిత్రీకరణ ఆస్ట్రియా, స్పెయిన్ దేశాలలో జరగుతోందని, ఆ తర్వాత చివరి దశ షూటింగ్ హైదరాబాద్ లో ఉంటుందని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రానికి వీ వీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ కం వినోదాత్మకమైన ఈ చిత్రంలో అఖిల్ సరసన సయేషా సైగల్ నటిస్తోంది.

ఇటీవలే సల్మాన్ ఖాన్ ఈ చిత్రం తాలూకు ప్రోమో విడుదల చేసారు. దానికి మంచి ఆదరణ లభించింది.

Send a Comment

Your email address will not be published.