అఖిల్ చిత్రం పై సయేషా సైగల్

మరికొన్ని అర్ధవంతమైన ఉద్వేగభరితమైన సన్నివేశాలు ఉంటే అఖిల్ చిత్రం విజయవంతం అయ్యేదని సయేషా సైగల్ అభిప్రాయపడ్డారు.

నాగార్జున తనయుడు అఖిల్ నటించిన తొలి చిత్రం అఖిల్ లో అతని సరసన సయేషా సైగల్ నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సయేషా సైగల్ కు కూడా టాలీవుడ్ లో ఇదే మొదటి చిత్రం కావడం గమనార్హం.

ఈ చిత్రం ఫ్లాప్ అవడంపై సయేషా సైగల్ పై విధంగా వ్యాఖ్యానించారు.

అఖిల్, సయేషా సైగల్ జంట అందంగా కనిపించినా ఈ జంట మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అనుకున్నంతగా లేవని ఆమె అన్నారు. ఈ కథలో అబ్బాయి క్యారక్టర్ లో నటించిన కుర్రాడు కనీసం ఐ లవ్ యు అని అమ్మాయికి చెప్పలేదని, కథాపరంగా కొన్ని అర్ధవంతమైన సన్నివేశాలు ఉండి ఉంటే బాగుండేదని ఆమె చెప్పారు. ఈ జంట విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే కుర్రకారు సినిమా చూడటానికి వచ్చేవారని అన్నారు. చిత్రంలో రొమాన్స్ తో పాటు కెమిస్ట్రీ కూడా మిస్ అయ్యిందని అన్నారు.

ప్రస్తుతం సయేషా సైగల్ బాలీవుడ్ లో అజయ్ దేవగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మొదటి సినిమా చేస్తోంది. ఈ సినిమా పై ఆమె బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

వెండితెరపై తాను రాణించడానికి మరెంతో శ్రమించాల్సి ఉందని, సినిమాల్లో నటించడం తనకు ప్రధానమని, అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడం ముఖ్యమని సయేషా సైగల్ అన్నారు. మంచి చిత్రాల్లో నటించాననే పేరు సంపాదించడం కోసం ఎంతైనా శ్రమిస్తానని చెప్పారు.

తెలుగులో మాట్లాడటం తనకు ఎలాంటి సమస్యా లేదని అంటూ తెలుగు నేర్చుకున్నానని, తెలుగు భాష తనకు ఇష్టమని తెలిపారు.

మహేష్ బాబుతో నటించాలననే కోరిక ఉందంటూ చెప్పిన సయేషా సైగల్ రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని కూడా తెలిపారు.

Send a Comment

Your email address will not be published.