అఖిల్ సరసన సయేషా సైగల్

అక్కినేని అఖిల్ హీరోగా నటించే మొదటి చిత్రంలో హీరోయిన్ కోసం సాగిన అన్వేషణ ముగిసింది.  సయేషా సైగల్ అఖిల్ జోడీగా నటించబోతున్నారు.

నిర్మాత, దర్శకుడు సుమ్మీత్ సైగల్ కూతురైన సయేషా సైగల్ ఓ ప్రముఖ మోడల్. ఆమె ఇప్పుడు నటిగా మారబోతోంది.  ఆమె హిందీలో అజయ్ దేవగన్ సినిమా శివాయ్ లో నటించేందుకు రంగం సిద్ధమైంది. అలనాటి హిందీ తార సిరా బానుకి సయేషా సైగల్ మనవరాలి వరస కూడా.

అమ్య్రా దస్తుర్, సునీల్ శెట్టి కుమార్తె, తదితరులు ఎందరినో చూసిన తరువాత చివరికి సయేషా సైగల్ ను అఖిల్ జోడీగా ఎన్నుకోవడం విశేషం. అఖిల్ తొలి చిత్రం త్వరలోనే మొదలు కానుంది.

Send a Comment

Your email address will not be published.