అది నాకు ప్రత్యేకం

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సారధ్యంలో ఇటీవల విడుదల అయిన కిల్లింగ్ వీరప్పన్ సినిమా నాకెంతో ప్రత్యేకమైనదని కన్నడ నటి పరుల్ యాదవ్ చెప్పింది.

ఈ చిత్రంలో ఆమె ఓ పోలీస్ ఇన్ఫార్మర్ గా నటించింది. ఈ పాత్ర తనకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావడానికి ద్వారాలు తెరచిందని పరుల్ యాదవ్ చెప్పింది.

తెలుగు చలన చిత్ర నిర్మాతల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్తూ తాను ఓ మంచి కథ కోసం చూస్తున్నానని తెలిపింది.

కిల్లింగ్ వీరప్పన్ లో తనకు వచ్చిన అవకాశాన్ని ఆమె మాటల్లోనే చూద్దాం…………..

“నేను ముంబైలో ఉన్నప్పుడు ఆర్జీవీ బృందంలోని ఒకరి నుంచి నాకు కాల్ వచ్చింది. ఆర్జీవీ మరో పది నిమిషాల్లో మీకు కాల్ చేస్తారన్నది ఆ ఫోన్ కాల్ సందేశం. అయితే ఆ కాల్ ని నేను అంత సీరియస్ గా తీసుకోలేదు. ఆ కాల్ ఓ సాధారణ కాల్ గా భావించాను. అయితే సరిగ్గా పది నిమిషాలకు ఆర్జీవీ నాకు కాల్ చేశారు. కన్నడ రంగంలో నేను పెద్ద స్టార్ అన్నది ఆయనకు తెలీదన్నారు. కథ నచ్చకపోతే నేను చేయను అని నాకు కచ్చితంగా చెప్పవచ్చు. అందుకు ఆలోచించక్కరలేదు అన్నారు ఆయన. అయితే ఆయన మాటలు నాకు వినపడనట్టు నటించాను. అసలు నాతో మాట్లాడింది ఆర్జీవేనా అని చెక్ చేసుకున్నాను. ఎందుకంటే ఆడిషన్ లేకుండా ఏ పాత్రా ఏ అవకాశమూ రాదు. అయితే ఎప్పుడైతే నమ్మకం కుదిరిందో అప్పుడు నేను ఫోన్ చేసి పాత్ర చేయడానికి సమ్మతించాను. కిల్లింగ్ వీరప్పన్ సినిమా నేను అంతకుముందు చేసిన సినిమాలకు భిన్నమైనది. నేను పోషించిన పాత్ర నిజమైన క్యారక్టర్. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ వ్యక్తిని తీసుకుపోయి వీరప్పన్ ని హతమార్చడానికి కొంత సమాచారం రాబట్టుకుంటారు నా క్యారక్టర్ రూపంలో. ఆ అమ్మాయిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది తమ పనికి ఎన్నుకున్నప్పుడు ఆమె వయస్సు జస్ట్ ఇరవై ఏళ్ళు అని ఆర్జీవీ చెప్పారు. అయితే ఆ పాత్ర చేయడానికి ఎలా ఒప్పుకున్నానా అనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎందుకంటే నాకు అప్పటి వరకు పోలీసులతో ఎలాంటి సంబంధాలూ లేవు. అలాంటప్పుడు నేను ఇన్ఫార్మర్ పాత్రలో ఎలా రాణించాగలనా అని అనిపించింది. షూటింగ్ జరుగుతున్నంతసేపు థ్రిల్లింగ్ గా అనిపించింది. నేను మేకప్ ఏదీ చేసుకోలేదు. ఆ పాత్ర చేయడానికి ముందు నిజమైన ఇన్ఫార్ గా ఉన్న ఆమెను కలవాలని ఉంది. కలిసే వీలు ఉంటుందా అని అడిగాను. ఆమెను కలిసే అవసరం లేదు అని ఆర్జీవీ అన్నారు. మీడియా కూడా ఆమెను చూడలేదని, కనుక నేను చెప్పినట్టు నటిస్తే చాలు అని ఆయన చెప్పారు. ఆ పాత్రను నాకు అర్ధమైన రీతిలో చేసాను. అయినా ఆమెను చూడాలని నేను ఎంతో ఆత్రుత కనబర్చాను. చివరికి ఆర్జీవీ ఆమె ఫోటో మాత్రం చూపించారు. ఆర్జీవీ ఓ ఫ్రెండ్ లా అందరికి తగు ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రధాన నటుడు మొదలుకుని లైట్ బాయ్ వరకు ఎవరిని తక్కువ చేసే వారు కాదు ” అని పరుల్ యాదవ్ తన కిల్లింగ్ వీరప్పన్ అవకాశం గురించి చెప్పారు.

Send a Comment

Your email address will not be published.