అదేదో కల

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి దర్శకత్వం వచించే అవకాశం తనకు రావడం ఒక కల అని కె ఎస్ రవీంద్ర (బాబీ) చెప్పారు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం రవీంద్రకు రెండో సినిమా.

ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం పవర్. అది విడుదల అయిన రెండు నెలలకు ఆయనకు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించే అదృష్టం కలిగింది.

నిర్మాత శరత్ మరార్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆయన ఇచ్చిన అవకాశం ఒక కల అని, అసలు ఊహించలేదని రవీంద్ర చెప్పారు. ఆయన తన పేరు అధికారికంగా ప్రకటించే వరకు తానూ నమ్మలేదని అన్నారు.

సర్దార్ గబ్బర్ చిత్రానికి స్క్రిప్ట్ మొత్తం పవన్ కళ్యాన్ దేనని, ఆ స్క్రిప్ట్ కి తానూ అయిదు నెలలు వర్క్ చేసానని, ఆ తర్వాతే షూటింగ్ కి వెళ్లామని రవీంద్ర తెలిపారు. నిరుడు ఏప్రిల్ లో షూటింగ్ మొదలు పెట్టామని, ఇప్పుడు పూర్తి అయ్యిందని, సరిగ్గా సంవత్సరం పట్టిందని చెప్పారు.
దర్శకత్వం విభాగంలో పవన్ కళ్యాన్ జోక్యం ఉందని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆయన స్క్రిప్ట్ అందించిన క్రమంలో ఒక రైటర్ గా నాకు సహకరించారని, అంతే తప్ప ఆయన దర్శకత్వంలో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని అన్నారు. అయినా మా ఇద్దరి ఆలోచనలు దాదాపుగా కలిసి సాగాయని, ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నానని రవీంద్ర చెప్పారు. ఈ ఏడాది పొడవునా ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో చాలా నేర్చుకున్నట్టు తెలిపారు. ఓర్పు ఎంత అవసరమో ఆయన వల్ల తెలుసుకున్నాను అని రవీంద్ర చెప్పారు.

Send a Comment

Your email address will not be published.