అదేమీ ఐటెం నెంబర్ కాదు....

ఇప్పుడున్న తారాలలో బహుళ ప్రతిభ గల నటి శృతి హాసన్. ఆమె ఒక గాయకురాలే కాదు. నటి. డ్యాన్సర్ కూడా. ఒక పాత్ర నుంచి మరొక పాత్రకు అప్పటికప్పుడు మారిపోగల ప్రతిభ ఆమె సొంతం.

ఈమధ్య వచ్చిన ఒక సినిమాలో శృతి హాసన్ ఒక ఐటెం నెంబర్ కు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాట ఐటెం పాట కాదని, అదొక ప్రత్యేకమైన పాట అని శృతి హాసన్ చెప్పింది.

ఇటీవల ఆమె తేవర్ అనే సినిమాలో ఒక పాట కూడా పాడింది. ఆ పాటను సినిమాలో సోనాక్షి పై చిత్రీకరించారు. ఈ పాట విషయాన్ని ప్రస్తావిస్తూ శృతి హాసన్ తాను ఆరో ఏట నుంచి పాడుతున్నానని, తాను మొదట్లో గాయని అని చెప్పుకుంది. అదేమంత పెద్ద విషయం కాదని, తాను తన కోసమే కాకుండా మరెవరి కోసమైనా పాటలు పాడిన సందర్భాలున్నాయని శృతి చెప్పింది.

అందుకే ఆమెతో మొదట పాట పాడించడానికే సంప్రదించారు. టాలీవుడ్ కానీ బాలీవుడ్ గానీ కొలీవుడ్ గానీ తాను ఈ మూడు భాషా చ్చిర పరిశ్రమలను వేర్వేరుగా చూడలేదని ఆమె చెప్పింది. భాష ఏదైనా జనానికి వినోదం అందించేవే తప్ప మరొకటి కాదని ఆమె అభిప్రాయం. ఈ మూడింటి మధ్య ఉన్న తేడా అల్లా ప్రాంతాలు , భాషలు తప్పించి మరొకటి కాదని చెప్పింది.

ఆగడు చిత్రంలో ఆమె ఒక ఐటెం సాంగ్ చేసింది. అలాగే తేవర్ చిత్రంలోనూ. అయితే ఈ పాటల విషయంలో ఎంతో తేడా ఉందని, వాటిని ఐటెం సాంగ్ లా చూడకూడదని తెలిపింది. ఈలాంటి పాటల విషయంలో బాలీవుడ్ కాస్తంత స్పష్టత కలిగి ఉందని ఆమె చెప్పింది.

ప్రస్తుతం ఆమె మహేష్ బాబుతో కలిసి ఒక సినిమాతో బిజీగా ఉంది. ఆ చిత్రం ఎంతో ప్రధానమైనదని, ఈ చిత్రంలో తన క్యారక్టర్ భిన్నమైనదని చెప్పింది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కోరట్ల శివ ఎంతో గొప్ప మనిషని అంటూ మహేష్ బాబుతో కలిసి పని చేయడం ఇంకా గొప్ప అని శృతి చెప్పింది.

ఆమె తన సోదరి అక్షర గురించి మాట్లాడుతూ ఆమె త్వరలో ఒక సినిమాతో ప్రేకషకుల ముందుకు రానున్నాడని, ఆమె స్మార్ట్ గర్ల్ అని చెప్పింది. మేమిద్దరం ఇంట్లో సినిమా షూటింగ్ గురించి మాట్లాడుకోమని భోజనాలు చేసే సమయంలోను సినిమా విషయాలు ప్రస్తావించామని శృతి వివరించింది.

Send a Comment

Your email address will not be published.