అదే అదే కామెడీగా...

అల్లరి నరేష్ రెండు పాత్రలు పోషించిన జంప్ జిలానీ చిత్రం విడుదలైంది. ఇది కామెడీ చిత్రం. తమిళంలో వచ్చిన గలగలప్పు అనే సినిమాకి ఇది రీమేక్. అల్లరి నరేష్ ఒక చిత్రంలో ఫుల్ లెంగ్త్ లో ద్విపాత్రాభినయం చెయ్యడం ఇదే తొలిసారి. అల్లరి నరేష్ కు జంటగా ఇషా చావ్లా, స్వాతీ దీక్షిత్ నటించారు. చిత్రానికి ఈ సత్తి బాబు దర్శకత్వం వహించారు.

సత్తిబాబు పాత్రలో ( అల్లరి నరేష్) ఒక హోటల్ ను నిడదవోలులో తన తాత (కోట శ్రీనివాస రావు) , గంగ (స్వాతి దీక్షిత్) సహాయంతో నడుపుతాడు. ఈ హోటల్ పెద్దగా నడవదు. అయినా తాత కోసం నడుపుతాడు. ఇంతలో ఆ ఊరికి ఓ కొత్త హెల్త్ ఇన్ స్పెక్టర్ మాధవి (ఇషా చావ్లా) వస్తుంది. ఆమెను సత్తిబాబు ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సత్తిబాబు సోదరుడు రాంబాబు (అల్లరి నరేష్) జైలు నుంచి విడుదల అవుతాడు. అతను సత్తిబాబుతో కలుస్తాడు. అయితే ఎప్పుడూ ఏదో ఒక సమస్య పుట్టిస్తుంటాడు రాంబాబు. అంతేకాక గంగను ప్రేమిస్తాడు.

మరోవైపు ఉగ్ర నరసింహా రెడ్డి (పోసాని కృష్ణ మురళి) వచ్చి మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఉగ్ర నరసింహా రెడ్డి దుష్టుడు. అతనిని పెళ్లి చేసుకోవడానికి మాధవికి ఇష్టం లేదు. మాధవితో ఉగ్ర నరసింహా రెడ్డి పెళ్లి కాకుండా చూసి తను ప్రేమించిన ఆ అమ్మాయిని మళ్ళీ తన వశం చేసుకుంటాడు.

ఎన్నో మలుపులతో సాగినా రొటీన్ కామేడీగానే అనిపిస్తుంది ఈ చిత్రం.

తమిళంలో ఇద్దరు హీరోలు నటించారు. కానీ తెలుగులోకొచ్చేసరికి ఆ రెండు పాత్రలను అల్లరి నరేష్ పోషించాడు. ఈ రెండు పాత్రలలోనూ అల్లరి నరేష్ చెప్పుకోదగ్గ రీతిలో నటించాడు. రాయలసీమ ఫ్యాక్ష నిస్టుగా నటించిన పోసాని సెకండ్ హాఫ్ లో వస్తాడు. అక్కడినుంచి తనదైన రీతిలో నటించి పోసాని అందరినీ మెప్పించాడు. ఈ చిత్రంలో ఎం ఎస్ నారాయణ, తాగుబోతు రమేష్ రావు రమేష్ తదితరులు నటించారు.

డైలాగులలో పంచ్ కొరవడింది. కథను రబ్బరు ముక్కలా సాగదీశారు. దీనితో ప్రేక్షకులకు బోరు కొట్టవచ్చు. క్లైమాక్స్ లో ఎక్కువమంది యాక్టర్లను తీసుకురావడంతో అంతా అయోమయంగా అనిపిస్తుంది. దీనిని మరింత మెరుగుగా నడిపించి ఉండవచ్చు. ఎడిటింగు కూడా మెరుగుపరచవలసింది.

సినీమాటోగ్రఫి, సంగీతం పరవాలేదు.

మొత్తంమీద ఇదొక టైం పాస్ సినిమా. సెకండ్ హాఫ్ లో కామెడీ కాస్తంత పరవాలేదు.

Send a Comment

Your email address will not be published.